ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ (One plus) గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐ ఫోన్ తో పోటి పడుతూ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో స్మార్ట ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకుని వస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనే విషయం గురించి మాత్రం కంపెనీ ఇప్పటి వరకు ఇక్కడ కూడా తెలియజేయలేదు. కానీ ఆన్ లైన్ లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లో 1. 5 కే రిజల్యూషన్ తో కూడిన కర్వ్ డ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేయనున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పని చేయనున్నట్లు తెలుస్తుంది. సెన్సార్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కెమెరా విషయానికి వస్తే..ట్రిపుల్ కెమెరా సెటప్ తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు.
ఇందులో 50 మెగా పిక్సెల్స్, 8 మెగా పిక్సెల్స్ , 32 మెగా పిక్సెల్స్ కెమెరాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 16 మెగా పిక్సెల్స్ తో ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.7 ఇంచెస్ తో కూడి అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే తో రానుంది. సెన్సార్ ను కూడా కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ ఎంత ధరకు లభిస్తుంది అనేది ఎక్కడా కూడా పేర్కొనలేదు. ఈ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం.
Also read: ఆ నటికి నాన్ బెయిలబుల్ వారెంట్..ఎందుకంటే!