OU PG: 'వన్ టైం ఛాన్స్'.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్!

పీజీలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి 'వన్ టైం ఛాన్స్'కు అవకాశం కల్పించింది. ఆగస్టు 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

New Update
OU PG: 'వన్ టైం ఛాన్స్'.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్!

Osmania university: పీజీలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి 'వన్ టైం ఛాన్స్'కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల్లో ఓయూ అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్ చేయని విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించింది.

అయితే ఈ పరీక్షలు రాయాలనుకునేవారు గతంలోని హాల్ టికెట్, మార్కుల మెమో కాపీలను అప్లికేషన్ కు జతచేసి ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలని సూచించింది. ఇక రూ.500 లేట్ ఫీజు ఆగస్టు 28 వరకు చెల్లించుకోవచ్చని సంబంధితి అధికారులు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలకు ఓయూ పరీక్షల విభాగం, ఓయూ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వెబ్ సైట్: https://www.osmania.ac.in/examination-results.php

ఇక హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం గత కొన్నేళ్లుగా బ్యాక్ ల్యాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్ టైం ఛాన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో నామమాత్రపు ఫీజుతో ఈ పరీక్షలు నిర్వహించిన ఓయూ గతేడాది నుంచి పెనాల్టీ ఛార్జెస్ కింద భారీ మొత్తంలో వసూలు చేయడం వివాదాస్పమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు