టీనేజ్‌లో చాలా మంది ఇతర జెండర్స్‌కి అట్రాక్ట్ అవుతారు. అది లవ్ అని అనుకుంటే పొరపాటే. అసలు ఏదీ లవ్, ఏదీ అట్రాక్షన్ అన్నది మనకి మనంగా డిసైడ్ అవ్వాలేని పరిస్థితిలో ఉంటాం. అయితే కొంతమంది సినిమాల్లో చూపించినట్టు వేరొకరిపై మనసు పారేసుకుంటారు. వారినే తలుచుకోని బతుకుంటారు. ఇదంతా సినిమాల ఎఫెక్టే కావొచ్చు.. మరికొందరు మాత్రం ట్రూగా లవ్ చేస్తారు. ఈ విషయాన్ని సంబంధిత లవర్‌కి ఎక్స్‌ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ధైర్యం చేసి చెప్పలేరు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఓపెన్‌గా చెప్పే డేర్‌నెస్ ఉండాలి. లేకపోతే లవ్‌కే కాదు మిగిలిన విషయాల్లోనూ లైఫ్‌లో వెనకపడిపోతాం. అయితే లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత అమ్మాయి/అబ్బాయి రిజెక్ట్ చేస్తుందేమోనన్న భయంతో చాలా మంది మనసులో విషయాలను చెప్పరు. కానీ వన్ సైడెడ్ లవ్ సక్సెస్ చేసుకోవడానికి కొన్ని దారులున్నాయి. ఒకవేళ ఫెయిల్ అయిన బాధపడకుండా ఉండటానికి టిప్స్ కూడా ఉన్నాయి.. వన్ సైడ్ లవ్‌లో ఉన్నవాళ్లు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
➼ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి: మీ భావాలను అర్థం చేసుకోండి, వాటిని అంగీకరించండి. మీ భావోద్వేగాలను గుర్తించుకోండి. మీ పరిస్థితి గురించి మీతో మీరే నిజాయితీగా ఉండటం ముఖ్యం.
➼ కమ్యూనికేషన్: మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను తెలియజేయండి. వారు ప్రతిస్పందించినా, చేయకున్నా బాధపడవద్దు. కమ్యూనికేట్ చేయడం వల్ల మీరు ప్రేమించినవారు మీ పట్ల ఏ వైఖరితో ఉన్నారో ఓ క్లారిటీ వస్తుంది.
➼ వారి భావాలను గౌరవించండి: మీరు ప్రేమించిన వారు తిరిగి మిమ్మల్ని ప్రేమించాలని రూల్ లేదు. ఎవరి లైఫ్ వారికి నచ్చినట్టు ఉండాలి. వేరే వారి లైఫ్ మీకు నచ్చినట్టు ఉండాలని కోరుకోకూడదు. అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి రిప్లై వచ్చినా అంగీకరించండి. వారి భావాలను గౌరవించండి. వారిపై ఒత్తిడి చేయవద్దు.
➼ స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వ్యక్తిగతంగా, మానసికంగా మీతో మీరే సమయాన్ని గడపండి. మీకు ఇష్టమైన వాటిని వదులుకోవద్దు. లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. అన్నిటికంటే సెల్ఫ్ గ్రోత్ ముఖ్యం. ప్రేమించిన వారు తిరిగి లవ్ చేయకున్నా కుంగిపోకుండా మీ ఎదుగుదలపై ఫోకస్ పెట్టండి.
➼ కొత్త వారిని కలవండి: వారి మనసులో మీకు స్థానం లేదని తెలిసిన తర్వాత కూడా వారినే పట్టుకోని వేలాడవద్దు. కొత్త వ్యక్తులను కలవండి. మీ భావాలను పరస్పరం పంచుకునే ఇతరులను కనుగొనండి. మీకు కాస్త రిలీఫ్ వస్తుంది.
➼ సమయం-సహనం: కొన్నిసార్లు ఇతరుల భావాలు టైమ్‌కి తగ్గట్టుగా మారవచ్చు. ఓపికపట్టండి. అవసరమైతే సంబంధిత వ్యక్తికి టైమ్ ఇవ్వండి. రిలేషన్‌లోకి రావాలని తొందరపెట్టకండి.
➼ అంగీకారం: వన్ సైడ్ లవ్.. టూ సైడ్‌గా మారుతుందని అనుకోవద్దు. అది కొన్నిసార్లే సాధ్యం. ఏం జరిగినా అంగీకరించడంతో పాటు ముందుకు సాగడం నేర్చుకోండి.
➼ చాలా అవకాశాలు ఉన్నాయి బాసూ: లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండైనట్టు కాదు.. జీవితంలో ఎన్నో ఆనందాలుంటాయి. లవ్ ఒక్కటే హ్యాపీనేస్ కాదు. మనం వెతికే ప్రేమ కంటే మనల్ని వెతుక్కుంటే వచ్చే ప్రేమ గొప్పదన్న సినిమా డైలాగ్ నిజమేనని తెలుసుకోండి.
ALSO READ: వెన్నునొప్పికి చెక్ పెట్టే ఈ చిట్కాలు!