Leo: ఒక్క పోస్టర్.. వంద వివాదాలు లియో

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ లియో. సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న మూవీ కాబట్టి.

Leo: ఒక్క పోస్టర్.. వంద వివాదాలు లియో
New Update

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ లియో. సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న మూవీ కాబట్టి. పైగా విజయ్ లాంటి మాస్ హీరో నటించిన సినిమా కాబట్టి లియోపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవల ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, కొన్ని పోస్టర్లు వచ్చాయి. కానీ తాజాగా రిలీజైన పోస్టర్ మాత్రం విమర్శలకు దారితీసింది. నాలుగేళ్ కిందటొచ్చిన కోల్డ్ పర్స్యూట్ అనే సినిమాకు సరిగ్గా ఇలాంటి పోస్టర్లే డిజైన్ చేశారు. అక్కడితో అయిపోలేదు. ఆ సినిమాలో కనిపించినలాంటి ఆయుధమే, లియోలో కూడా కనిపిస్తోంది. దీంతో విజయ్-లోకేష్ సినిమాపై విమర్శలు చెలరేగుతున్నాయి.

హాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న 'ఎ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్' అనే సినిమా ఆధారంగా దర్శకుడు లోకేశ్, విజయ్ హీరోగా లియో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే చూసేశారు. అదెలా అంటే.. జగపతి బాబు ప్రధాన పాత్రలో 2010లో వచ్చిన గాయం-2 సినిమా ఇదే. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకు సీన్-టు-సీన్ రీమేక్ గా వచ్చింది గాయం-2. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా పోస్టర్లను తలపించేలా లియో పోస్టర్లు డిజైన్ చేశారు. అదే ఇప్పుడు టాలీవుడ్ లో విమర్శలకు తావిస్తోంది.

బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు రూపంలో లియో సినిమాకు దసరా బరిలో గట్టి పోటీ ఉంది. అయినప్పటికీ టాలీవుడ్ లో లియోపై మంచి బజ్ ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ పోస్టర్ తో చేతులారా అంచనాలు తగ్గించుకుంది లియో యూనిట్.

లియో ఒక యాక్షన్ థ్రిల్లర్. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాదు, రచయిత కూడా. సినిమాలో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. ఎన్నో ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఇక విలన్ గా సంజయ్ దత్ నటించాడు. గౌతమ్ మీనన్, అర్జున్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 19 న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది లియో.

#director #leo #hero-vijay #lokesh-kanagaraj
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe