OnePlus Watch : రూ.99 లకే 100 గంటల బ్యాటరీ స్మార్ట్ వాచ్!

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి విడుదలైంది. కేవలం 99 రూపయలకు బుక్ చేసుకోవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే 100 గంటల పాటు ఉండగలదు. దీని ధరెంత.. ఫీచర్లెంటో చూసెయ్యండి...

New Update
OnePlus Watch : రూ.99 లకే 100 గంటల బ్యాటరీ స్మార్ట్ వాచ్!

OnePlus Smart Watch : భారత మార్కెట్లో(Indian Market) వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల(OnePlus Smartphones) కు ఉన్న డిమాండ్, క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ కంపెనీ ఇటీవలే మన దేశంలో వన్‌ప్లస్ స్మార్ట్‌వాచెస్(OnePlus Smart Watches) లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది వరకే వన్‌ప్లస్ మొదటి స్మార్ట్‌వాచ్ 2021 సంవత్సరంలో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన వన్‌ప్లస్ వాచ్ 2 పేరుతో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ వాచ్‌కి సంబంధించిన కొంత సమాచారం ఇప్పటికే లీకయ్యింది. ఈ వాచ్‌లో రౌండ్ డయల్ అందుబాటులో ఉంటుంది. వాచ్ 2 గూగుల్ వేర్ ఓఎస్ 4తో లాంచ్ అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అందరి కంటే ముందుగా ఈ వాచ్ కావాలనుకునే వారు కేవలం రూ.99తో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాదు రూ.2000 వరకు డిస్కౌంట్, ప్రీ బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్ బడ్స్ కూడా పొందొచ్చు. ఈ వాచ్ 2లో ఏయే ఫీచర్లు ఉన్నాయి.. దీని అసలు ధర ఎంత వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Also Read : హోలీ రంగులతో తస్మాత్ జాగ్రత్త!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
కొన్ని నివేదికల ప్రకారం, ఈ వాచ్ డిజైన్ వన్‌ప్లస్ 12 నుంచి ప్రేరణ పొందింది. ఈ OnePlus వాచ్ 2 1.43 inches AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇందులో Qualcomm Snapdragon W5 Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించబడుతుంది. ఈ OnePlus వాచ్ 2ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

ఫీచర్లు ఇలా..
OnePlus Watch 2 రౌండ్ డయల్‌తో రాబోతోంది. ఈ వాచ్ లెఫ్ట్ సైడ్ 2 బటన్లు ఉంటాయి. లాంచ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, దీని ఫీచర్లకు సంబంధించి వివరాలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఇది 402mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో IP68 రేటింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది వాటర్, డస్ట్ నుంచి రక్షణగా ఉంటుంది. ఇందులో 1GB RAM, 4GB స్టోరేజీ, Google Wear OS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.

OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ.99తో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు అసలు ధరపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. బడ్స్ వైర్‌లెస్ Z2 ANC పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో, OnePlus ఆఫ్ లైన్ స్టోర్స్‌లో కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు.

OnePlus స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ 5.0, GPS, GLONASS, గెలీలియోతో పాటు మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఈ వాచ్‌ను భారతదేశంలో రూ.24,999కి కొనుగోలు చేయొచ్చు. ఇది మిడ్ నైట్ బ్లాక్ స్టీల్, మూన్ లైట్ సిల్వర్ కలర్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ వాచ్ రెండు వేరియంట్లు సిలికాన్ వాచ్ బెల్టులతో స్టెయిన్‌లెస్ స్టీల్ కేసులను కలిగి ఉంటాయి. దీని అసలు ధర రూ.27,999 ఉంటే.. లాంఛింగ్ ఆఫర్ కింద మూడు వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు ICICI క్రెడిట్ కార్డు, వన్ కార్డు ద్వారా మరో రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

Advertisment
తాజా కథనాలు