Transgender Reservation: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్ జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా గుర్తు చేసింది.

New Update
Transgender Reservation: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు

Transgender Reservation:పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ట్రాన్స్ జెండర్లను కూడా అందరితో సమానంగా చూస్తామని గతంలో పశ్చిమ బెంగాల్ ప్రకటన చేసింది. కాగా వారికి ఇంతవరకు రిజర్వేషన్లు కల్పించని విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. వెంటనే వారికి ఒక శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ మంథా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

2014, 2022ల్లో రెండు సార్లు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో అర్హత సాధించినా తనను ఇంటర్వ్యూకు పిలవలేదని పేర్కొంటూ ఓ ట్రాన్స్ జెండర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ట్రాన్స్ జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా గుర్తు చేసింది.

Advertisment
తాజా కథనాలు