IIT-Banaras: ఐఐటీ-బనారస్‌లో చల్లారని మంటలు.. మరో విద్యార్థినిపై వేధింపులు 

ఐఐటీ-బనారస్‌లో మరో కొత్తవిషయం వెలుగులోకి వచ్చింది. మొదటి  కేసుకు రెండు రోజుల ముందు అంటే అక్టోబరు 30న మరో అత్యాచార ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

IIT-Banaras: ఐఐటీ-బనారస్‌లో చల్లారని మంటలు.. మరో విద్యార్థినిపై వేధింపులు 
New Update

IIT-Banaras: ఐఐటీ-బనారస్‌లో నవంబర్ 1వ తేదీ రాత్రి బీటెక్ విద్యార్థిని వేధింపులకు గురైంది. ముగ్గురు దుండగులు విద్యార్థిని, ఆమె స్నేహితుడిని తుపాకీతో బెదిరించి ఆపై విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె బట్టలు విప్పి వీడియో తీశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా గురువారం క్యాంపస్‌లో 2500 మంది విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనల మధ్య మరో కొత్తవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు రెండు రోజుల ముందు అంటే అక్టోబరు 30న మరో అత్యాచార ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ  రెండు ఘటనలు ఒకే చోట జరిగాయని ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థి పార్లమెంట్ సభ్యుడు ప్రణవ్ తెలిపారు. ఆ తర్వాత సహ విద్యార్థితో వెళ్తున్న ఓ విద్యార్థినిని దుండగులు బలవంతంగా తాకారు. వేధించారు. అయితే ప్రైవసీ దృష్ట్యా విద్యార్థి మౌనంగా ఉండిపోయింది.  దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు అని ప్రణవ్ అంటున్నారు. 

మరోవైపు బీటెక్ విద్యార్థినిని(IIT-Banaras) గురువారం ముగ్గురు దుండగులు తుపాకీతో వేధించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ అమ్మాయి ని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఇప్పుడు వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ ప్రవీణ్ సింగ్ తెలిపారు. 

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు

విద్యార్థి పార్లమెంట్ సభ్యుడు ప్రణవ్ మాట్లాడుతూ, మొదటి సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మళ్లీ వేధింపులు(IIT-Banaras) జరగడంతో, క్యాంపస్‌లో కలకలం రేగింది. ఆ తర్వాత నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు పాత కేసుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇందులో ఒకరిద్దరు నిందితులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. క్యాంపస్ భద్రత కోసం, 2 సబ్-ఇన్‌స్పెక్టర్లు - 5 మంది కానిస్టేబుళ్లను ప్రొక్టోరియల్ బోర్డు కార్యాలయంలో మోహరించారు. 

కాగా విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మూసివేసిన  క్యాంపస్(IIT-Banaras) విద్యార్థుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు చర్యలు ప్రారంభించినట్లు వికాస్ దూబే తెలిపారు. జిల్లా యంత్రాంగం విద్యాశాఖాధికారులతో మాట్లాడింది. వారి నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఐఐటీ కోసం సరిహద్దు గోడను సిద్ధం చేస్తారు. అదే సమయంలో, వేధింపుల సంఘటన జరిగిన ప్రదేశంలో రాత్రిపూట బ్లాక్ చేస్తామని అధికారులు అంటున్నారు. 

Watch this Video:

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe