TS Holiday: తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు సెలవు.. కీలక ఉత్తర్వులు జారీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది.

TS: వైద్యకళాశాలల్లో 4,356  బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
New Update

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ (EC) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

అటు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు నవంబర్ 29న కూడా సెలవు ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: లెజెండరీ క్రికెటర్‌ సోదరి మృతి.. విషాదంలో అభిమానులు..!

ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పోలింగ్ నిర్వహణ ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం వేరు వేరుగా ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల స్టోరేజీ నిమిత్తం రూ. 19.45కోట్లను సర్కార్ రిలీజ్ చేసింది. వీవీప్యాట్ల, ఈవీఎంల స్టోరేజీకి వేర్ హౌజ్ ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు.

#telangana-elections-2023 #telangana-assembly-elections #ts-holiday #november-30-govt-holiday
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe