TS Holiday: తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు సెలవు.. కీలక ఉత్తర్వులు జారీ! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. By Bhoomi 17 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ (EC) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇది కూడా చదవండి: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే? అటు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు నవంబర్ 29న కూడా సెలవు ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి: లెజెండరీ క్రికెటర్ సోదరి మృతి.. విషాదంలో అభిమానులు..! ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు, నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పోలింగ్ నిర్వహణ ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం వేరు వేరుగా ఉత్తర్వులు రిలీజ్ చేసింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల స్టోరేజీ నిమిత్తం రూ. 19.45కోట్లను సర్కార్ రిలీజ్ చేసింది. వీవీప్యాట్ల, ఈవీఎంల స్టోరేజీకి వేర్ హౌజ్ ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు. #telangana-elections-2023 #telangana-assembly-elections #ts-holiday #november-30-govt-holiday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి