Children's Day 2023 Gift: బాలల దినోత్సవం సందర్భంగా... మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!

ప్రతి సంవత్సరం నవంబర్ 14న...బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మీ పిల్లలకు స్కూల్ బ్యాగ్, నచ్చిన ఆహారం, నచ్చిన టిఫిన్ బాక్స్, పుస్తకాలు, బొమ్మలు ఇవ్వండి. మీరు ఇచ్చే బహుమతిని చూసి మీ పిల్లలు ముసిముసినవ్వులతో చిందేస్తారు.

Children's Day 2023 Gift: బాలల దినోత్సవం సందర్భంగా... మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!
New Update

ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి. అందుకే ఈరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహ్రూ 1889 నవంబర్ 14న ప్రయాగ్ రాజ్ లో జన్మించారు. నెహ్రూకు పిల్లలంటే ప్రాణం. పిల్లలు అంటే దేవుడి రూపంలో ఇంట్లో ఉన్న అందమైన పువ్వులు అని ఎప్పుడూ చెబుతుండేవారు.

పిల్లలపట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను దృష్టిలో ఉంచుకుని, నెహ్రూ జయంతి సందర్బంగా నవంబర్ 14ను బాలలదినోత్సవంగా జరుపుకుంటారు. తమ మధురమైన చిన్నారి అల్లరి చేష్టలు ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. నవ్వుతూ, ఆడుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతాయి. ఈ రోజు పాఠశాలల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు మీ పిల్లలతోపాటు వారి స్నేహితులకు కూడా బహుమతులు ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు. బహుమతిగా ఒక బొమ్మ, బట్టలు లేదా మంచి పుస్తకాన్ని ఇవ్వండి. చిన్నారులకు ఆనందాన్ని అందించే బొమ్మలతో పాటు వారి జ్ఞానాన్ని పెంచే బహుమతులు ఇవ్వండి.

బాలల దినోత్సవం సందర్భంగా కొన్ని గిఫ్ట్ ఐడియాస్ మీకోసం..

-మీ పిల్లలు పాఠశాలకు వెళుతుంటే, ఈసారి బాలల దినోత్సవం సందర్భంగా వారికి కొత్తవి అందించి వారిని సంతోషపెట్టవచ్చు.

-వారికి రోజూ సహాయం చేయడానికి స్కూల్ బ్యాగ్ ఇవ్వండి. వారు సంతోషంగా ఉంటారు. రోజూ స్కూలుకి వెళ్లడం అంటే ఇష్టపడతారు.

-మీ పిల్లలకు నచ్చిన ఆహారాన్ని తయారు చేయండి. అప్పుడే వారు ఇష్టంగా తింటారు. లేదా వారికి తెలియకుండా వారి టిఫిన్‌లో వారికి నచ్చినవి తయారు చేసిన పెట్టండి. లేదంటే వారికి నచ్చిన టిఫిన్ బాక్స్ బహుమతిగా అందించండి. పిల్లలు రకరకాల టిఫిన్స్ బాక్సులను ఇష్టపడుతుంటారు.

-పిల్లలకు అవగాహన పెంచేందుకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. చదవడం వల్ల వారి జ్ఞానం పెరుగుతుంది.

-మీ పిల్లలు ఇంకా స్కూల్‌లో చేరకపోతే, మీరు ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వవచ్చు.

-మీ పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉంటే, మీరు అతనికి చెస్ బోర్డ్, టెన్నిస్, వాలీబాల్, ఫుట్‌బాల్ మొదలైన అనేక రకాల బహుమతులు ఇవ్వవచ్చు.

-వారి అభిరుచులు తెలుసుకుని వారికి నచ్చిన బహుమతులు అందిస్తే చిరునవ్వు చిందిస్తూ గంతులేస్తారు. పిల్లల కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైందంటూ ఏదీ లేదు.

-బాలల దినోత్సవం రోజు మీ పిల్లలతో గడపండి. వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రులు బిడ్డతో కలిసి కూర్చుండి ముచ్చటిస్తే..అంతకంటే ఆనందం మరొక్కటి ఉండదు.

ఇది కూడా చదవండి: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్!

#childrens-day-gift #childrens-day-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe