Home Tips: పది నిమిషాల్లోనే పాత సోఫాను కొత్తగా మార్చుకోండి

పాత, మురికి సోఫాతో ఇబ్బందిగా ఉంటే గోరువెచ్చని నీటిలో స్పూన్ లిక్విడ్ డిష్ వాషింగ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోని మురికి ఉన్న దగ్గర దానిని స్ప్రే చేయాలి. తరువాత తేలికపాటి చేతులతో రుద్దిన తర్వాత స్పాంజ్, మెత్తటి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి.

New Update
Home Tips: పది నిమిషాల్లోనే పాత సోఫాను కొత్తగా మార్చుకోండి

Home Tips: సోఫా అనేది ప్రతి ఇంట్లో ఉంటే ఫర్నిచర్. అయితే..కొందరి ఇంట్లో ఖరీదైనవి ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో సోఫాలు ఉంటున్నాయి. కానీ సోఫా మురికిగా, ఎక్కడైనా పాడైపోయినట్లయితే..ప్రతిసారీ కొత్తది కొనడం సాధ్యం కాదు. ఆ సమయంలో మీ సోఫా మంచిగా ఉండాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సోఫాను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కొన్ని చిట్కాల ఉన్నాయి. అదనంగా..ఇది కొత్త సోఫాగా ఉండేలా చేస్తుంది. సోఫాను ఎలా క్లీనింగ్‌ చేయాలలో ఆ చిట్కాలు ఎంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సోఫా క్లీనింగ్ చిట్కాలు:

  • ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే..వారు చదువుకోవడం, భోజనం చేయడం వంటి పనులన్నీ చేస్తారు. ఈ సమయంలో దుమ్ముతో పాటు ఆహార ముక్కలు సోఫాపై పడతాయి. వాటిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్‌ను వడొచ్చు. ఇది సోఫాకు పేరుకుపోయిన దుమ్మును తొలగిస్తుంది.

గుడ్డతో శుభ్రం:

  • గుడ్డతో సోఫాను శుభ్రపరిచే ఈ పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ముందుగా 2- 3 కప్పుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ లిక్విడ్ డిష్ వాషింగ్ కలపాలి. బాగా కలిపిన తర్వాత..మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఇప్పుడు సోఫాలో మురికి ఉన్న దగ్గర దానిని స్ప్రే చేయాలి. తేలికపాటి చేతులతో రుద్దిన తర్వాత స్పాంజ్, మెత్తటి గుడ్డ సహాయంతో శుభ్రం చేసుకోవాలి.

లెదర్ సోఫా శుభ్రం:

  • ఈ సోఫాను శుభ్రం చేయడానికి మార్కెట్‌లో క్లీనర్లు ఉంటాయి. ఇంట్లోనే కాలంటే రెండు చెంచాల వెనిగర్‌లో 1 స్పూన్ లిన్సీడ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంతో సోఫాను శుభ్రం చేస్తే సోఫాకు కొత్తగా కనిపిస్తుంది.

ఆరబెట్టాలి:

  • ముఖ్యంగా సోఫాను ఎండలో ఆరబెట్టాలి. పైన చెప్పిన విధంగా శుభ్రం చేసిన తర్వాత.. దానిని ఆరబెట్టడం చాలా ముఖ్యం.అందుకు సోఫా సహజ గాలి, ఫ్యాన్ గాలిలో పొడిగా ఉండనివ్వాలి. సోఫా తడిగా ఉంటే..అందులో ఫంగస్ వచ్చి దుర్వాసన వచ్చే అవకావం ఉంది.

ఇది కూడా చదవండి: కామెర్లు కూడా క్యాన్సర్ లక్షణమేనా?..వైద్యులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు