Old Couple Bike Ride: సాధారణంగా స్టైలిష్ KTM బైక్‌లను యువకులు మాత్రమే నడుపుతారు. అయితే ఇక్కడ ఓ పెద్దాయన తానేమీ యువతకు తక్కువ కాదన్నట్లు భార్యని కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్‌పై ఎక్కించుకుని జాలీ రైడ్‌కి వెళ్లాడు. ఆ పెద్దాయన బైక్ నడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వయస్సు కేవలం నంబర్ మాత్రమే అని అంటున్నారు.
Old Couple Bike Ride: ఎంతో మంది అబ్బాయిలకు కనువిందు చేసిన బైక్ కేటీఎం అని చెప్పొచ్చు. ఈ సంస్థ ప్రవేశపెట్టిన బైక్‌లన్నీ యువతకు ఇష్టమైనవే. యువకులు ఈ బైక్‌పై స్టైల్‌గా జాలీ రైడ్‌కు వెళతారు . సాధారణంగా, KTM సహా ఇతర కొత్త మోడల్ బైక్‌లలో సీటు కొంచెం ఎత్తుగా ఉంటుంది. అందువలన పెద్దలు అలాంటి బైక్‌లపై కూర్చోవడానికి ఇష్టపడరు. ఆ బైక్‌లు నడపడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పెద్ద వయసు వారికి. ఎక్కడో పైన కూచుని.. కిందకి ఉన్న హ్యాండిల్ వంగుని పట్టుకుని డ్రైవ్ చేయడం చాలా కష్టం వారికీ. కానీ ఓ ముసలాయన నేను కుర్రాళ్ళకేం తక్కువకాదు.. అంటూ తన భార్యను కేటీఎం ఆర్సీ 390 బైక్‌పై ఎక్కించుకుని జాలీ రైడ్‌కు వెళ్లాడు.
Old Couple Bike Ride: తమిళనాడుకు చెందిన ఓ వృద్ధ దంపతులు KTM RC 390 బైక్‌పై జాలీ రైడ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను rancibridalmakeup అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "పనికి వెళుతున్నప్పుడు ఈ అందమైన జంట ఆకర్షించింది" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వైరల్ వీడియోలో, తాత తన భార్య వెనుక కూర్చొని తెల్లటి చొక్కా, ఆకుపచ్చ శాలువాతో స్టైలిష్‌గా బైక్ నడుపుతున్న అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఇతర బాటసారులు వారిని వీడియో తీస్తుండడంతో ఈ వృద్ధ దంపతులు తమలో తాము మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందించారు.
5 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 38 మిలియన్ వ్యూస్, 2.8 మిలియన్ లైక్‌లు వచ్చాయి.
ఈ వీడియోకు కామెంట్స్ కూడా బాగానే వచ్చాయి. వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే అంటూ ఒకాయన వ్యాఖ్యానించాడు. ఆ పెద్దాయనను అభినందిస్తున్నాను. ఇప్పటికీ తన భార్యను రాణీలా చూసుకుంటున్నాడు అంటూ ఒకాయన కామెంట్ చేశాడు. తాత రాక్డ్.. వుయ్ షాక్డ్ అంటూ ఓ యువకుడు కామెంట్ పెట్టాడు.
టాటా బైక్ నడుపుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు వయస్సు కేవలం ఒక సంఖ్య అని వ్యాఖ్యానించారు.