Ola Electric : ఏడాదికి కోటి ఎలక్ట్రిక్ టూవీలర్స్.. 25వేల కొత్త ఉద్యోగాలు.. ఓలా సంచలనం 

Ola Electric : ఏడాదికి కోటి ఎలక్ట్రిక్ టూవీలర్స్.. 25వేల కొత్త ఉద్యోగాలు.. ఓలా సంచలనం 
New Update

Electric Two Wheeler : ఎలక్ట్రిక్ టూవీలర్(Electric Two Wheeler) కంపెనీ ఓలా(Ola) భారీ ప్రణాళికలను అమలులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు తమిళనాడు(Tamil Nadu) లోని క్రిష్ణగిరి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ కొత్త EV తయారీ యూనిట్ నిర్మాణంలో ఉంది.  ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే  సుమారు 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. చెన్నైలో రెండురోజుల  గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ భవిష్ అగర్వాల్(CEO Bhavish Aggarwal) ఈ సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా భవిష్ మాట్లాడుతూ, 'తయారీ సామర్థ్యంతో పాటు, 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ EV హబ్‌లో విక్రేత - సరఫరాదారుల నెట్‌వర్క్ కూడా ఉంటుంది. మేమంతా కలిసి తమిళనాడు అలాగే  భారతదేశాన్ని EVల  ప్రపంచ కేంద్రంగా మారుస్తాము.' అని అన్నారు. 

ఫిబ్రవరి నుంచి  ఉత్పత్తి.. 

మేము కేవలం ఎనిమిది నెలల్లో తమిళనాడులో భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహనాల(Ola Electric) తయారీ కేంద్రాన్ని నిర్మించగలిగాము. వచ్చే నెల నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దీన్ని కూడా రికార్డు సమయంలో ప్రారంభిస్తున్నాం. ఇది భారతదేశం- తమిళనాడులో మాత్రమే సాధ్యమవుతుంది అని భవిష్ చెప్పారు. 

Gigafactory నుంచి ప్రతి సంవత్సరం 1 కోటి ద్విచక్ర వాహనాలు..

ఇది భారతదేశపు మొదటి గిగా ఫ్యాక్టరీ అని భవిష్ తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో నడపడం ప్రారంభం అయితే, ప్రతి సంవత్సరం సుమారు 1 కోటి ద్విచక్ర వాహనాలు ఇక్కడ తయారు చేయవచ్చని అంచనా. గత ఏడాది జనవరిలో, ₹7,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

Also Read: చెన్నైలో సందడిగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. 

Ola జూన్ 2023లో..

గత సంవత్సరం జూన్‌లో ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులో ఈ మెగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రకటించింది. ఇందులో, EVలను తయారు చేయడానికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ,  ఇతర సరఫరాదారుల సహకారంతో ఒక గిగాఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు.

32% మార్కెట్ వాటా..

Ola Electric ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా నిలిచింది.  నవంబర్ వరకు కంపెనీ మార్కెట్ వాటా దాదాపు 32%. 

తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(GIM) నిన్న (జనవరి 07)చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈవెంట్ లో 9 భాగస్వామ్య దేశాలతో పాటు 30కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. GIM ఈరోజు అంటే జనవరి 08 న ముగుస్తుంది. సింగపూర్, కొరియా, డెన్మార్క్, జర్మనీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ సదస్సులో తమిళనాడులో తమ వ్యాపారాల ఏర్పాటు, విస్తరణకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. దీని ప్రకారం రూ.31,000 కోట్ల పెట్టుబడుల కోసం తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు భారత్‌లోని జెనీ సింగపూర్ ఎంబసీ ప్రకటించింది. ఐఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్‌ను విస్తరించేందుకు హోసూర్‌లో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని టాటా నిర్ణయించింది. దీని ద్వారా వచ్చే 6 ఏళ్లలో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తమిళనాడులో రూ.16,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తూత్తుకుడిలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల తమిళనాడులో 3,500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా, హ్యుందాయ్ కార్ల తయారీ, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు, క్యాప్లిన్ ఫార్మాస్యూటికల్ తయారీ, సెంప్‌కార్ప్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌తో సహా అనేక కంపెనీలు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

Watch this interesting Video:

#electric-bike #two-wheelers #ceo-bhavish-aggarwal #ola-electric
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe