Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు

రోజంతా యాక్టీవ్ గా ఉంచడంలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొంత మంది ఉదయాన్నే ఫుల్ ఆయిల్ తో చేసిన ఆహారాలు తింటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. హెల్తీ అండ్ సింపుల్ గా ఈ ఆయిల్ ఫ్రీ బ్రేక్ ఫాస్ట్స్ ట్రై చేయండి. ఫ్రూట్ బౌల్, స్ప్రౌట్ చాట్, ఇడ్లీ, బ్రేడ్ టోస్ట్.

New Update
Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు

Break Fast: రోజంతా ఎనర్జీగా, ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. సాధారణంగా చాలా మంది అల్పాహారంలో పూరి, దోష, బోండా, ఆయిల్ ఐటమ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి తినేటప్పుడు రుచిగా బాగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత వీటిలోని ఆయిల్ కంటెంట్ మబ్బుగా, నిద్ర వస్తున్నట్లుగా చేస్తుంది. అంతే కాదు జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారిలో సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. అందుకే ఉదయం పొట్ట లైట్ గా, హెల్తీగా ఉండడానికి ఈ ఆయిల్ ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేయండి.

నూనె లేని బ్రేక్‌ ఫాస్ట్‌

పండ్ల ముక్కలు

మీ ఆహారంలో సీజనల్ పండ్లను చేర్చుకోవడం ఎంతో మంచిది. ఇవి మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లను అందిస్తాయి. అలాగే పండ్లు తింటే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఉదయం అల్పాహారంలో రెండు లేదా మూడు రకాల పండ్లను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు అంటున్నారు.

publive-image

Also Read: Mobile: చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

పోహా

పోహా అనేది ఎంతో ఫేమస్‌ అయిన భారతీయ వంటకం. దీనిని మర్మరాలను ఉపయోగించి చేస్తారు. ఇందులో శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు ను కలుపుతారు. దీన్ని ఉదయం సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా తినడానికి కూడా రుచిగా ఉంటుంది.

మొలకల చాట్

మొలకల్లో ఎన్నో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి శెనగలు లేదా పెసలను రాత్రి నీటిలో నానబెట్టి ఆపై తడి కాటన్ గుడ్డలో కట్టాలి. దీంతో అవి మొలకెత్తడమే కాకుండా మృదువుగా కూడా మారుతాయి. మొలకలను చాట్‌గా చేసుకోవడానికి ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మరసం వేసి తినవచ్చు.

publive-image

ఇడ్లీ

బియ్యం, మినపప్పును పులియబెట్టడం ద్వారా ఇడ్లీని తయారు చేస్తారు. ఇది జీర్ణక్రియకు ఎంతో మంచిది. అల్పాహారంగా కొబ్బరి లేదా వేరుశెనగ చట్నీతో ఇడ్లీని తినవచ్చు. ఇడ్లీ తినడం వల్ల కడుపు కూడా తొందరగా నిండిన భావన కలుగుతుంది.

publive-image

బ్రేడ్  టోస్ట్

బ్రేక్‌ఫాస్ట్‌ కోసం టోస్ట్‌ మంచి ఎంపిక. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. దీనితో పాటు వేరుశెనగ వెన్న, అరటి పండు ముక్కలు, అవకాడో కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

publive-image

Also Read: Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు