BIG BREAKING: హైదరాబాద్ లో ఆ కాలేజీ సీజ్.. చెరువులో నిర్మించినట్లు తేల్చిన అధికారులు!

మరో అక్రమ నిర్మాణంపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ రెసిడెన్షియల్‌ క్యాంపస్‌ పత్తికుంట చెరువులో సుమారు నాలుగు ఎకరాలు ఆక్రమించి నిర్మించారని హైడ్రా తేల్చింది. దీంతో ఆ కాలేజీని అధికారులు సీజ్ చేశారు.

New Update
BIG BREAKING: హైదరాబాద్ లో ఆ కాలేజీ సీజ్.. చెరువులో నిర్మించినట్లు తేల్చిన అధికారులు!

SR Junior College: నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ రెసిడెన్షియల్‌ క్యాంపస్‌ కబ్జా వ్యవహారం హైడ్రా కంట్లో పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాం పేట్ రోడ్డు హిల్ కౌంటి ఎదురుగా ఉన్న పత్తికుంట చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దాదాపు పది ఎకరాల్లో విస్తరించి ఉన్న పత్తికుంట చెరువు చాలా భాగం కబ్జాలకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

చెరువులో సుమారు నాలుగు ఎకరాలు ఆక్రమించి ఎస్‌ఆర్‌ రెసిడెన్షియల్ కాలేజ్ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో ఎస్‌ఆర్‌ రెసిడెన్షియల్ కాలేజ్‌ను సీజ్ కార్పొరేషన్ అధికారులు మూసి వేశారు. వరదల కారణంగా ఎస్‌ఆర్‌ కాలేజ్ సెల్లార్ లోకి వరద నీరు వచ్చింది. క్యాంపస్ లో సుమారు 500 మంది విద్యార్థుల దాకా ఉన్నారు. వర్షాల వల్ల సెలవులు అంటూ కాలేజ్ యజమాన్యం విద్యార్థులును ఇళ్లకు పంపేసింది.

Also Read: దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..!

Advertisment
తాజా కథనాలు