Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు.! టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు చెందిన రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ లోని 'వివాహ భోజనంబు' హోటల్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను, సింథటిక్ కలర్స్ వాడిన పదార్థాలను గుర్తించారు. By Jyoshna Sappogula 10 Jul 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Hero Sundeep Kishan: హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రిసెంట్ గా పలు పేరొందిన రెస్టారెంట్ లోనూ అధికారులు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. Also Read: పదేళ్ల క్రితమే మాకు పెళ్లి.. నాకు అబార్షన్.. లావణ్య సంచలన ఆరోపణలు! ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు చెందిన రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ లోని 'వివాహ భోజనంబు' హోటల్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను, సింథటిక్ కలర్స్ వాడిన పదార్థాలను గుర్తించారు.హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. గడువు ముగిసిన 25 కిలోల చిట్టిముత్యాలు బియ్యం గుర్తించారు. 𝗩𝗶𝘃𝗮𝗵𝗮 𝗕𝗵𝗼𝗷𝗮𝗻𝗮𝗺𝗯𝘂, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 08.07.2024 * FSSAI license true copy was displayed at the premises. * Chittimutyalu Rice (25kg) was found with Best Before date as 2022 and 500gms of Coconut Grates found with synthetic food colours. Stock has been… pic.twitter.com/yY5yWkknk1 — Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 10, 2024 Also Read: తలిదండ్రులు కాబోతున్న యూట్యూబర్ ధృవ్ రాఠీ, భార్య జూలీ ఎల్‌బిఆర్ ఆహార తయారీలో ఉపయోగిస్తున్న, కస్టమర్లకు అందిస్తున్న వాటర్ బాటిళ్లకు నీటి విశ్లేషణ నివేదిక లేదని తెలిపారు. రెస్టారెంట్ లో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నా ఇంకా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. వివాహ భోజనంబు రెస్టారెంట్ వెబ్‌సైట్‌లో హీరో సందీప్ కిషన్ ఫొటో ఉంది. ఆయన ఇతరులతో పాటు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. #hero-sundeep-kishan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి