Office Space: భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు ఈ ఏడాది డిమాండ్ బాగానే ఉంటుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. FICCI-Colliers రిపోర్ట్ ప్రకారం, దేశీయ, విదేశీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం 2024లో 5-55 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు తీసుకోవచ్చు. ఆరు ప్రధాన నగరాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, పూణేలలో 5.82 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం(Office Space) మొత్తం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. ఇండస్ట్రీ బాడీ FICCI అలాగే, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ఈ వారం ప్రారంభంలో తమ నివేదికను విడుదల చేశాయి. ఈ రిపోర్ట్ ఆఫీస్ స్పేస్(Office Space) కోసం డిమాండ్ అవకాశం ఉన్న మూడు రకాల పరిస్థితులను వివరిస్తుంది. వాస్తవికంగా ఉండే అవకాశాలు, ఆశావాద అంచనాలు, తక్కువలో తక్కువగా ఉండవచ్చనే అంచనాలతో పరిస్థితిని రిపోర్ట్ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Office Space: హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్!
హైదరాబాద్ తో బాటు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం ఈ ఏడాది భారీ డిమాండ్ ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి క్రమేపీ కంపెనీలు నో చెబుతున్న పరిస్థితుల్లో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరిగే అవకాశాలు పెరిగాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
Translate this News: