ఎలా జరిగింది..? దర్యాప్తు స్పీడప్ By Trinath 13 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి బాలాసోర్ రైలు ప్రమాదంపై దర్యాప్తు స్పీడందుకుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇటు సీబీఐతో పాటు రైల్వేశాఖ టీమ్ కూడా విచారణ చేస్తోంది. ఐతే ఈ కేసులో ముఖ్యంగా ఐదుగురు రైల్వే అధికారుల పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. బహనాగ బజార్ స్టేషన్ మాస్టర్‌తో పాటు మరో నలుగురు సిగ్నలింగ్ సిబ్బంది.. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై తదుపరి చర్యలుంటాయని వెల్లడించాయి రైల్వే వర్గాలు. ఉద్దేశపూర్వకంగా చేశారా..? అనుకోకుండా జరిగిందా..? సాంకేతిక లోపంతో జరిగిందా..? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ.. కొందరిని విచారించింది. ఐతే.. సిస్టమ్ మాన్యువల్ ట్యాంపరింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్..తన దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని తెలిపారు సీనియర్ అధికారులు. ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 288మంది మృతి చెందారు..వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఐతే త్వరలోనే CRS నివేదిక రానుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది రైల్వే శాఖ. మరోవైపు ఈ దుర్ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైల్వే ఉద్యోగ సంఘాలు. రైల్వే పనితీరుపై వస్తున్న విమర్శలను చూస్తుంటే బాధగా ఉందని..ఇది తమ చిత్తశుద్ధిని అవమానించడమేనంటున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి