ఎలా జరిగింది..? దర్యాప్తు స్పీడప్

New Update

బాలాసోర్‌ రైలు ప్రమాదంపై దర్యాప్తు స్పీడందుకుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇటు సీబీఐతో పాటు రైల్వేశాఖ టీమ్‌ కూడా విచారణ చేస్తోంది. ఐతే ఈ కేసులో ముఖ్యంగా ఐదుగురు రైల్వే అధికారుల పాత్రపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు అధికారులు. బహనాగ బజార్‌ స్టేషన్‌ మాస్టర్‌తో పాటు మరో నలుగురు సిగ్నలింగ్‌ సిబ్బంది.. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్‌ నివేదిక ఆధారంగా వారిపై తదుపరి చర్యలుంటాయని వెల్లడించాయి రైల్వే వర్గాలు.

ODISHA TRAIN ACCIDENT UPDATE

ఉద్దేశపూర్వకంగా చేశారా..? అనుకోకుండా జరిగిందా..? సాంకేతిక లోపంతో జరిగిందా..? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ.. కొందరిని విచారించింది. ఐతే.. సిస్టమ్‌ మాన్యువల్‌ ట్యాంపరింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌..తన దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని తెలిపారు సీనియర్‌ అధికారులు.

ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్‌ భారతదేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 288మంది మృతి చెందారు..వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఐతే త్వరలోనే CRS నివేదిక రానుంది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది రైల్వే శాఖ. మరోవైపు ఈ దుర్ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైల్వే ఉద్యోగ సంఘాలు. రైల్వే పనితీరుపై వస్తున్న విమర్శలను చూస్తుంటే బాధగా ఉందని..ఇది తమ చిత్తశుద్ధిని అవమానించడమేనంటున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates: 

Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

హార్వర్డ్ విషయంలో ట్రంప్ ఆటలు సాగడం లేదు. యూనివర్శిటీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చాలా గట్టిగానే అడ్డంకులు పడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేదే లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా విదేశీ విద్యార్థుల అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వెంటనే విదేశీ విద్యార్థులను వెనక్కు పంపేయాలని ఆజ్ఞలు జారీ చేసింది.

Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

దీనిపై యూనివర్శిటీ కోర్టుకెక్కింది. ఇంతకు ముందు విశ్వవిద్యాలయం గ్రాంట్స్ కట్ట చేసినప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేసింది. ఇప్పుడు కూడా విదేశీ విద్యార్థుల అనుమతి నిషేధంపై కోర్టుకు వెళ్ళింది యూనివర్శిటీ. అక్కడ హార్వర్డ్ కు అనుకూలంగా జడ్జి తీర్పు ఇవ్వండతో ట్రంప్ ప్రభుత్వానికి చెక్ పడ్డట్టయింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ బరోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

విద్యార్థులకు అన్యాయం..

హార్వర్డ్ లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు వీసా కోసం అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్  కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు అప్లై చేస్తారు. అలాంటప్పుడు ఎస్‌ఈవీపీ సిస్టమ్ నుంచి హార్వర్డ్ ను తొలగించడం చాలా అన్యాయమంటూ యూనివర్శిటీ పిటిషన్ వేసింది.

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఒక్క నిర్ణయంతో విశ్వవిద్యాయంలో పావు వంతు స్టూడెంట్స కు అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పింది. దీని వలన చాలా మంది భవిష్యత్తు గల్లంతు అవుతుందంటూ మొరపెట్టుకుంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. అమెరికా ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఇలా విద్యార్థులను కషటపెట్టడం సముచితం కాదని కోర్టులో చెప్పింది. దీన్ని పరిగలోకి తీసుకున్న జడ్జి ప్రభుత్వ నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

today-latest-news-in-telugu | usa | america president donald trump | Trump Vs Harvard

  • May 24, 2025 20:46 IST

    జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!

    తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. జూన్ 2 నుంచి స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖలో చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు.

    Telangana Minister Ponguleti Srinivas Reddy
    Telangana Minister Ponguleti Srinivas Reddy

     



  • May 24, 2025 19:52 IST

    ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్‌ డ్రోన్లు

    ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం.

    Amazon  drone delivery



  • May 24, 2025 18:19 IST

    రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

    పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తోన్న వీరిద్దరూ మృతి చెందారు.

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • May 24, 2025 17:22 IST

    గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం

    భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌ లోని బనస్కాంత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి.

    Pakistani infiltrator



  • May 24, 2025 17:21 IST

    ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’

    సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.

    Kavitha
    Kavitha

     



  • May 24, 2025 17:21 IST

    దేశంలో కరోనా కొత్త వేరియంట్లు!

    దేశంలో పలు చోట్లు కొవిడ్‌ కొత్త వేరియంట్‌లను అధికారులు గుర్తిస్తున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 లను గుర్తించినట్లు  గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం శనివారం వెల్లడించింది.

    కబళిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌



  • May 24, 2025 16:07 IST

    నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు

    నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

    rains Telangana



  • May 24, 2025 16:06 IST

    మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

    గుజరాత్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి పోలీసులకు చిక్కాడు. భారత వైమానిక దళం (IAF), సరిహద్దు భద్రతా దళం (BSF) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ తో పంచుకున్నందుకు కచ్ ప్రాంతానికి చెందిన  సహదేవ్‌ సింగ్‌ గోహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

    pakistan-gudachari



  • May 24, 2025 15:07 IST

    భార్య చీర కట్టుకొని పురుషులతో డాక్టర్ శృంగారం.. ఆ వీడియోలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు

    ఉత్తరప్రదేశ్‌లో డాక్టర్ మహిళల వేషధరణలో పోర్న్ వీడియోలు చేసి అమ్ముకుంటున్నాడని అతని భార్య ఆరోపించింది. వరుణేష్ గవర్నమెంట్ క్వాటర్స్‌లో పురుషులతో కలిసి శృంగారం చేస్తేూ వీడియోలు తీశాడని.. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడని సింపీ పాండే అంది.

    Dr Varunesh Dubey (1)



  • May 24, 2025 15:06 IST

    తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు

    పెళ్లికి అంతా సిద్ధమైంది. వరుడు తాళితో కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాళి కట్టడమే ఇక మిగిలి ఉంది. అంతలోనే ఆపండి అన్న అరుపు. అందరూ చుట్టూ చూశారు. అరిచింది ఎవరో కాదు స్వయంగా వధువే. పూర్తి ఆర్టికల్ లోపల చదవండి

    Bride Calls Off Marriage



  • May 24, 2025 14:45 IST

    మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

    శాంసంగ్‌తో పాటు మిగతా స్మార్ట్‌ఫోన్లకు 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలి. లేకపోతే టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.

    Trump
    Trump

     



  • May 24, 2025 14:44 IST

    భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్‌ జాతీయుడు.. కాల్చి చంపిన BSF

    భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి.

    BSF shoots dead Pakistani intruder along international border in Banaskantha, Gujarat
    BSF shoots dead Pakistani intruder along international border in Banaskantha, Gujarat

     



  • May 24, 2025 14:43 IST

    19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్‌ ఎంపీ ఆగ్రహం

    ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్‌ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. ఏడాదిన్నరగా గాజాలో మీరు 19 వేల చిన్నారుల ప్రాణాలు తీశారని విమర్శించారు.

    israeli -mp -alleges in parliament19000-children -killed -in -gaza
    israeli -mp -alleges in parliament19000-children -killed -in -gaza

     



  • May 24, 2025 13:46 IST

    BREAKING: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

    ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.  

    test bcci
    test bcci Photograph: (test bcci)

     https://rtvlive.com/sports/bcci-announces-indian-test-squad-for-england-tour-telugu-news-9302215



  • May 24, 2025 13:31 IST

    Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే

    నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.

     Monsoon arrives in Kerala, earliest onset since 2009, Says IMD
    Monsoon arrives in Kerala, earliest onset since 2009, Says IMD

     



  • May 24, 2025 12:41 IST

    Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

    హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు నిన్న కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు.. అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

    Kodali Nani Latest Photos
    Kodali Nani Latest Photos

     



  • May 24, 2025 12:18 IST

    Actor Mukul Dev Dies at 54: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 'అదుర్స్' విలన్ కన్నుమూత.

    బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (54) మే 23న కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించి ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రాహుల్ దేవ్ సోదరుడు కాగా, తెలుగులో 'అదుర్స్', 'ఏక్ నిరంజన్', 'కృష్ణ' సినిమాలలో విలన్‌గా నటించారు.

    Actor Mukul Dev Dies at 54
    Actor Mukul Dev Dies at 54

     



  • May 24, 2025 11:04 IST

    Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన

    గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దయ చూపాలని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ విజ్ఞప్తి చేశారు.

    Tedros Adhanom Ghebreyesus
    Tedros Adhanom Ghebreyesus

     



  • May 24, 2025 10:59 IST

    Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

    తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Andhra pradesh tribal boy left by mother as collateral killed in captivity in tamil nadu
    Andhra pradesh tribal boy left by mother as collateral killed in captivity in tamil nadu

     



  • May 24, 2025 10:45 IST

    King Cobra on Bed UP: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)

    ఒక వ్యక్తి కింగ్ కోబ్రా పాముతో మంచంపై పక్కపక్కన పడుకుని భయపడకుండా వీడియో తీయడం వైరల్ అయింది. పాము అతని తలవైపు వచ్చి కన్నుల్లోకి చూడగానే అతడు ఒక్కసారిగా బెదిరిపోయి పరుగు తీశాడు. ఈ వీడియో చుస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తోంది..

    King Cobra on Bed UP
    King Cobra on Bed UP

     



  • May 24, 2025 10:17 IST

    MH: డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్

    మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 22 ఏళ్ళు లోపువారే .

    rape



  • May 24, 2025 07:17 IST

    Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

    పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.  

    pak
    Pakistan Army spokesperson Lieutenant General Ahmed Sharif and LeT chief Hafiz Saeed.

     



  • May 24, 2025 07:17 IST

    Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

    హార్వర్డ్ యూనివర్శిటీ ప్రవేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పడింది.విదేశీ విద్యార్ధుల ప్రవేశానికి అనుమతి రద్దు నిర్ణయాన్ని అడ్డకుంటూ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలను జారీ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినందువలన నిషేధాన్ని ఆపాలని చెప్పారు.

    usa
    Shock To Trump

     



  • May 24, 2025 07:16 IST

    CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

    కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.

    CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations
    CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations

     



  • May 24, 2025 07:15 IST

    SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

    ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో గెలిచింది. 

    ipl
    SRH VS RCB

     



Advertisment
Advertisment
Advertisment