Viral News: లక్ అంటే ఇదే మరి.. వరుసగా వచ్చి పడుతున్న డబ్బులు..

ఒడిషాలోని కేంద్రపరా, ఒలావర్ బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఒడిశా గ్రామ్య బ్యాంకు తెరిచేందుకు బ్యాంకు సిబ్బంది వచ్చారు. అయితే, అప్పటికే అక్కడికి జనం పోటెత్తారు. అందరూ తమ ఖాతాల్లోంచి డబ్బు తీసుకోవడానికి వచ్చారు.

New Update
Central Govt Scheme: ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్.. మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్..!!

Odisha Bank Customers Get Money: మనం నిత్యం ఎన్నో వింత, విచిత్రమైన ఘటనల గురించి వింటూనే ఉంటాం. అదే వింత, విచిత్రమైన పరిస్థితి మనకు ఎదురైతే? అవును, ఒక్కసారిగా మీ బ్యాంక్(Bank Account) ఖాతాలో లక్షలాది రూపాయలు(Money) జమ అయితే? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అటు ఆనందం, ఇటు కన్‌ఫ్యూజన్, మరోవైపు టెన్షన్.. ఈ డబ్బులు ఎక్కడివి? ఎవరు వేశారు? ఎందుకు వేశారు? నా ఖాతాలోనే ఎందుకు వేశారు? అని ఒకటే హైరానా పడుతుంటారు. ఇదే పరిస్థితి కొందరు ఖాతాదారులకు ఎదురైంది. వారి ఖాతాల్లో ఒక్కసారిగా లక్షలాది రూపాయలు వచ్చి పడ్డాయి. దాంతో కొందరు సంతోషంలో ఆ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు క్యూ కడుతుంటే.. మరికొందరు మాత్రం భయంతో హైరానా పడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒడిషాలోని కేంద్రపరా, ఒలావర్ బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఒడిశా గ్రామ్య బ్యాంకు తెరిచేందుకు బ్యాంకు సిబ్బంది వచ్చారు. అయితే, అప్పటికే అక్కడికి జనం పోటెత్తారు. అందరూ తమ ఖాతాల్లోంచి డబ్బు తీసుకోవడానికి వచ్చారు. కొందరు ఖాతాల్లో రూ. 30 వేలు, మరికొందరి ఖాతాల్లో 40 వేలు, రూ. 50 వేలు చొప్పున డబ్బు జమ అయ్యింది. కొందరి ఖాతాల్లో అయితే ఏకంగా లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున జమ అయ్యాయి. అయితే, బ్యాంకు వద్దకు వచ్చిన జనాన్ని చూసి బ్యాంక్ మేనేజర్ షాకక్ అయ్యాడు.

ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారి పెద్ద చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా ఖాతాలో డబ్బులు రావడంతో బ్యాంకు ఖాతాదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బ్యాంకు మేనేజర్ 300 ఖాతాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. “ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నించాము. ఈ ఖాతాల్లో ఈ సొమ్మును ఎవరు, ఎందుకు జమ చేశారన్నది ఇంకా తెలియరాలేదు. అకస్మాత్తుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు రావడంతో ఖాతాదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఖాతాల్లో రూ.30 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జమ అయింది.' అని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

మరోవైపు తమ ఖాతాల్లోకి డబ్బులు రావడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు తరఫు నుంచి ఇంకా విచారణ కొనసాగుతోందని, ఈ ఖాతాల్లో ఈ డబ్బు ఎలా, ఎందుకు జమ చేశారనేది త్వరలోనే తేలిపోనుంది. ఒడిషా గ్రామ్య బ్యాంక్ ఆ రాష్ట్రంలో కీలక ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా 549 శాఖలు ఉన్నాయి. 155 ATMలు, 2,340 మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 55 లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు.

Also Read:

Chandrababu Arrest: సిట్ కార్యాలయానికి లోకేష్, భువనేశ్వరి..

Chandrababu Arrest: సిట్ కార్యాలయానికి బాబు.. 20 ప్రశ్నలతో సిద్ధంగా సీఐడీ..

Advertisment
తాజా కథనాలు