Lunar Eclipse October 2023: హిందూమత ఆచార సంప్రదాయాలు, హిందూ మత గ్రంధాల ప్రకారం చంద్ర గ్రహణం, సూర్య గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వేద పండితులు.. ఈ గ్రహణాలను ప్రజలు నేరుగా చూడొద్దని చెబుతుంటారు. చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయిని హెచ్చరిస్తుంటారు. అంతేకాదు.. గ్రహణాలు ముగిసిన తరువాత కొన్ని శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తారు. ఆలయాల్లోనూ పూజారులు శుద్ధి చేస్తారు. అదే మాదిరిగా ప్రజలు తమ తమ ఇళ్లలోనూ శుద్ధి చేసుకోవాలని చెబుతారు. అయితే, ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడింది. ఇది చాలా ప్రత్యేకమైంది. అయితే, చంద్రగ్రహణం సమయంలో కొన్ని వాస్తు పరిహారాలు పాటిస్తే జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వేదార్చకులు, జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ పరిహారాలేంటో ఓసారి చూద్దాం..
చంద్రగ్రహణం తరువాత చేయాల్సిన పరిహారాలు..
☛ వాస్తు శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో గుడి తలుపులు మూసివేయాలి.
☛ చంద్రగ్రహణం ముగిసిన తరువాత ఇంట్లో దేవుడు గుడి ఉంటే ఆ గుడిని లేదా దేవుడిని ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేసి, గంగా జలంతో శుద్ధి చేయాలి.
☛ చంద్రగ్రహణం తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి అలంకరించాలి. భగవంతుడి వస్త్రాలను కూడా మార్చాలి.
☛ దేవునికి కొత్త వస్త్రాలు సమర్పించాలి. అవి ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి.
☛ చంద్రగ్రహణం తరువాత ఈ పరిహారాలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
☛ చంద్రగ్రహణం తరువాత ఈ చర్యలను పాటిచండం వలన సదరు వ్యక్తుల ఏనాడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోరని చెబుతున్నారు పండితులు. వీరిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం మత గ్రంథాలు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ దృవీకరించడం లేదు.
Also Read:
తెలంగాణ కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ షాక్.. ఆ ఒక్క ప్రకటనతో..
అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్..