/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/n-1-1-jpg.webp)
NTR: సైమా 2023 సెలబ్రేషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్(NTR) కుటుంబ సమేతంగా దుబాయ్ కు వెళ్లాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుక దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆవార్డుల వేడుకలు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. నిన్న రాత్రి కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రాబాబు అరెస్టయిన తర్వాత ఆ అంశంపై తారక్ ఇంత వరకు స్పందించలేదు. దీంతో, ఆయనపై టీడీపీ శ్రేణులతో పాటు పలువురు సినిమా సెలబ్రేటీలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన తారక్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఏమైనా మాట్లాడతారా? అని ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు చాలా కాలంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. పూర్తి స్థాయిలో తన దృష్టిని సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నాడు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం మాత్రం స్పందించలేదు. చంద్రబాబు అరెస్టై 10 రోజులు కావొస్తున్న.. ఎన్టీఆర్ మాట్లాడకపోవడంపై టీడీపీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సినిమా షూటింగ్ లేకపోయినా, చంద్రబాబు అరెస్టు విషయం తెలిసినా.. ఎందుకు స్పందించలేదన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కనిపించదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా అటెండ్ కావడం లేదు. కుటుంబసభ్యులు ఆహ్వానాలు పంపినా.. చాలా సందర్భాల్లో దూరంగా ఉంటున్నారు. ఒక వేళ వెళ్లినా, కార్యక్రమంలో అంటీఅంటనట్టుగా ఉంటారని టాక్.
కొంతకాలం క్రితం నందమూరి హరిక్రిష్ణ కూతురు సుహసిని కుమారుడి వివాహం జరిగింది. హైదరాబాద్ లో జరిగిని ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు, బాలక్రిష్ణ, పురందేశ్వరితో నందమూరి కుటుంబసభ్యులు సందడి చేశారు. వివాహానికి.. అలా వెళ్లి ఇలా వచ్చేశారు ఎన్టీఆర్. చంద్రబాబు, బాలక్రిష్ణ, ఇతర కుటుంబసభ్యులు వేడుకకు రాకముందే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.
ఢిల్లీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా.. వంద రూపాయల నాణెంను విడుదల చేశారు. వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి ఆహ్వానం పంపినా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఎన్టీఆర్ వందరూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రామక్రిష్ణ ఇతర నందమూరి కుటుంబసభ్యులు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రాం సైతం వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లలేదు.
అయితే, జూ.ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు తెలిపితే బాగుంటుందని ఆ పార్టీ నేతలతో పాటు, ఇటు ఫ్యాన్స్ సైతం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ టీడీపీ కి మద్దతు తెలిపితే ఇక వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అంటున్నారు. జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి తోడుగా ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే ఇక టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని రాజకీయ ప్రముఖులు తెలుపుతున్నారు.
Also Read: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఔట్..!! నెక్స్ట్ టార్గెట్ వీళ్లేనా..?