NTR Commemorative 100 Rupees Coin: విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా 2023 ఆగస్టు 28 న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన యన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల్లో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది.
అమ్మకాల్లో సరికొత్త రికార్డు
హైదరాబాద్ లో మింట్ కాంపౌండ్ లో తయారయిన యన్టీఆర్ స్మారక నాణెం మార్కెట్లోకి విడుదలైన ఏడాదిలోపు 20 వేల నాణేలు అమ్ముడు పోయాయని .. ఇది దేశంలోనే సరికొత్త రికార్డు అని హైదరాబాద్ లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం వెల్లడించింది.దేశంలోని స్మారక నాణేల విడుదల 1964లో ప్రారంభం అయింది.ఇప్పటి వరకు 200 స్మారక నాణేలను విడుదల చేయగా వాటిలో యన్టీఆర్ స్మారక నాణెం అత్యధిక విక్రయాలతో ప్రథమ స్థానంలో ఉందని చర్లపల్లి మింట్ కాంపౌండ్ ప్రకటించింది.
2023 డిసెంబర్ నాటికి మొత్తం 20వేల నాణేలు అమ్మకం
యన్టీఆర్ స్మారక నాణేలను హైదరాబాద్ లోని చర్లపల్లి మింట్ కాంపౌండ్ లో మొదట 12 వేలు మాత్రమే తయారు చేశారు.ఆ తరువాత డిమాండ్ పెరగడంతో మరిన్ని ముద్రించారు.2023 డిసెంబర్ నాటికి మొత్తం 20వేల నాణేలు అమ్మినట్లు మింట్ కాంపౌండ్ అధికారులు తెలియజేశారు.
అభిమానులు, పార్టీ నేతలు భారీగా కొనుగోలు
సాధారణంగా స్మారక నాణేలను కొంత మంది హ్యాబీగా సేకరిస్తూ ఉంటారు.కానీ..నందమూరి తారకరామారావు జ్ఞాపకార్థం విడుదల చేసిన నాణెం మాత్రం ఆయన అభిమానులు, పార్టీ నేతలు భారీగా కొనుగోలు చేస్తుండటం విశేషం.
ఈ నాణెం ఖరీదు రూ4,050లు నుంచి రూ4,850లు వరకు
ఈ నాణేలను ఆన్లైన్ అమ్మకాలతో పాటు, చర్లపల్లి కౌంటర్ ద్వారా కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.యన్టీఆర్ స్మారక నాణేన్ని సిల్వర్, కాపర్, నికెల్,జింక్ తో తయారుచేశారు.35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెం 44 ఎమ్మెల్యే మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. ఈ నాణేనికి ఒకవైపు మూడు సింహాలు,అశోక చక్రం,సత్యమేవ జయతే అనే పేరు, మరో వైపు అన్నగారి చిత్రం ఉంటుంది.ఈ నాణెం ఖరీదు రూ4,050లు నుంచి రూ4,850లు వరకు ఉంటుంది.
ALSO READ: గద్దర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్