BIG BREAKING : నీట్ యూజీ ఫలితాలు విడుదల

NEET UG ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఫలితాలను neet.ntaonline.inలో చెక్ చేసుకోవచ్చు. కాగా ఇటీవల అధికారిక వెబ్ సైట్‌లో నగరాలు, సెంటర్ వారీగా అభ్యర్థుల వివరాలను గోప్యంగా ఉంచి రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు
New Update

NEET Results : సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఎన్టీఏ NEET UG ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను neet.ntaonline.inలో చెక్ చేసుకోవచ్చు. జూలై 18న నీట్ యూజీ ఫలితాలను జూలై 20, మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రకటించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. హాజరైన విద్యార్థులు పొందిన మార్కులను తన వెబ్‌సైట్‌లో ప్రచురించాలని, విద్యార్థుల గుర్తింపును వెల్లడించవద్దని సుప్రీం కోర్టు ఏజెన్సీని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నీట్ యూజీ ఫలితాలను (NEET UG Results) ఈరోజు మధ్యాహ్నానికి నగరాలు, మధ్యాహ్నాల వారీగా వేర్వేరుగా ప్రచురించాలని ఆదేశించింది.

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ (NEET UG Paper Leak) కేసులో పాట్నాకు చెందిన నలుగురు వైద్య విద్యార్థులను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) గురువారం అరెస్ట్‌ చేసిన తర్వాత, విద్యార్థులపై వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఎయిమ్స్‌ పాట్నా డైరెక్టర్‌ డాక్టర్‌ గోపాల్‌ కృష్ణపాల్‌ తెలిపారు.

ఈ సంవత్సరం, NTA NEET UG పరీక్షను మే 5న 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. NEET UG ఫలితాలు జూన్ 4, 2024న ప్రకటించబడ్డాయి. పేపర్ లీక్ వ్యవహారంలో 1563 మందికి రీఎగ్జామ్ ను జూన్ 23న ఎన్టీయే నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలు జూన్ 30, 2024న ప్రకటించబడ్డాయి. ఈ సంవత్సరం ప్రధాన పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు, 1563 మంది అభ్యర్థులు రెండోసారి పరీక్ష రాశారు.

Also Read : తెలంగాణ ప్రజా కవి జయరాజ్‌కు గుండెపోటు




#nta #neet-ug-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి