Stock market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌!

Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
New Update

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market) శుక్రవారం సాయంత్రానికి ట్రేడింగ్‌ లాభాల్లో ముగించాయి. ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగియడంతో అక్టోబర్‌ నెల పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్‌ మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ 320 పాయిట్లు లాభాల బాటలో నడవగా..మరో కీలక సూచీ నిఫ్టీ 115 పాయింట్ల మేర పెరిగింది.

ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 284 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్‌ సూచీ 433 పాయింట్ల మేర లాభాలతో ఆశాజనకంగా ముగించాయి. ఈ క్రమంలో ప్రధాన రంగాలు అయినటు వంటి షేర్లు 2 శాతం లాభపడ్డాయి. నేడు మార్కెట్లు లాభాల బాటలో ముగిసే సరికి నిన్నటి నష్టాలు కొంత మేర తగ్గాయి.

దీంతో ఇన్వెస్టర్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. అన్ని బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 3.28 లక్షల కోట్లు పెరిగి రూ. 319.94 లక్షల కోట్లకు చేరుకుంది. శుక్రవారం లాభపడిన వాటిలో రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ లు ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, సిప్లా, యూపీఎల్, గ్రాసిమ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, టెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.

#stock-markets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe