Upi Circle: అదిరిపోయే అవకాశం..పేమెంట్స్ కోసం బ్యాంక్ ఎకౌంట్ అక్కరలేదు 

ఇకపై బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. బిల్స్ కట్టవచ్చు. సినిమా టికెట్స్ బుక్ చేయవచ్చు. ఎన్‌పీసీఐ ఇప్పుడు యూపీఐ సర్కిల్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేసేయవచ్చు. ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు  

Upi Circle: అదిరిపోయే అవకాశం..పేమెంట్స్ కోసం బ్యాంక్ ఎకౌంట్ అక్కరలేదు 
New Update

Upi Circle: చాయ్ తాగినా.. సినిమా టికెట్లు కొనాలన్నా.. అంతెందుకు పే అండ్ యూజ్ టాయిలెట్ ఉపయోగించాలన్నా ఇప్పుడు డిజిటల్ పేమెంట్ తో చాలా ఈజీ అయిపోయింది. యూపీఐ తీసుకొచ్చిన విప్లవం ఇది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్‌పీసీఐ చేసిన మేలు ఈ పేమెంట్ విధానం. ఈ విధానంలో మన బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఎవరిదైనా మొబైల్ నెంబర్.. క్యూఆర్ కోడ్ ద్వారా సెకెన్లలో డబ్బును పంపించేవచ్చు. అలాగే ఎవరి దగ్గర నుంచైనా మన బ్యాంక్ ఎకౌంట్ కు డబ్బు జమ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ యూపీఐ పేమెంట్ విధానంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ఇకపై బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా కూడా యూపీని ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. 

 Upi Circle: బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా.. ఎన్‌పీసీఐ తీసుకువచ్చిన ‘యూపీఐ సర్కిల్’ అనే విధానంలో యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటును తీసుకువచ్చింది. ఈ విధానంలో వేరే ఎవరిదైనా బ్యాంక్ ఎకౌంట్ ను మన యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు. బ్యాంక్ ఎకౌంట్ ఉన్న యూపీని వినియోగదారుని  ప్రైమరీ యూజర్ అంటారు. ప్రైమరీ యూజర్ తన వారికి ఎవరికైనా.. వారు కుటుంబ సభ్యులు కావచ్చు.. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు కావచ్చు ఎవరైనా సరే తన యూపీఐ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇలా యాక్సెస్ ఇచ్చిన వారిని సెకండరీ యూజర్స్ అంటారు. ఈ సెకండరీ యూజర్స్ తమకు బ్యాంక్ ఎకౌంట్ లేకపోయినా.. ప్రైమరీ యూజర్ బ్యాంక్ ఎకౌంట్ నుంచి పేమెంట్స్ చేయగలుగుతారు. ఇలా ప్రైమరీ యూజర్ ఎందరినైనా సెకండరీ యూజర్ గా యూపీఐ సర్కిల్ లో చేర్చుకోవచ్చు. 

Upi Circle: ఒకరకంగా చెప్పాలంటే.. ఈ విధానం క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇచ్చే యాడ్ ఆన్ కార్డు విధానంలో ఉంటుంది. అంటే ఎకౌంట్ వేరేవారిది.. అందులో డబ్బు అవసరానికి ఖర్చుపెట్టుకునే వెసులుబాటు ఎకౌంట్ లేకపోయినా యాడ్ ఆన్ కార్డు ఉన్నవారికి ఉంటుంది. అలానే యూపీఐ సర్కిల్ కూడా పనిచేస్తుంది. కాకపొతే ఇందులో కార్డు ఉండదు అంతే. డిజిటల్ గా పేమెంట్స్ చేయగలుగుతారు. 

ఎవరికి ఉపయోగకరం?

Upi Circle: చదువుల కోసం ఇంటికి దూరంగా ఉండే పిల్లలకు ఇలా సెకండరీ యూజర్ గా ఉంచడం వలన వారికి యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం దొరుకుతుంది. వారికి అవసరమైనప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని ఉండదు. యూపీఐ సర్కిల్ ద్వారా వారు పేమెంట్స్ చేసుకోగలుగుతారు. ఇందులో ఎంత వరకూ పేమెంట్ సెకండరీ యూజర్ చేయవచ్చు అనేది ప్రైమరీ యూజర్ నిర్ణయించవచ్చు. అంటే లాక్ పెట్టవచ్చు. అలాగే, ప్రతి ట్రాన్సక్షన్ తనకు తెలిసేలా నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో పనిచేసేవారికి.. డ్రైవర్లకు ఈ యూపీఐ సర్కిల్ యాక్సిస్ ఇవ్వడం ద్వారా వారికి ప్రతి పనికీ డబ్బు ఇచ్చి పంపించే ఇబ్బంది తప్పుతుంది. అంతేకాకుండా, బిజినెస్ చేసుకునే వారు తమ ఉద్యోగులను వివిధ పనులపై వేరే ఊర్లకు పంపడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వారికి యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఖర్చులను మానిటర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. 

ప్రస్తుతం చాలా యూపీఐ యాప్స్ ఈ విధానాన్ని అందిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న యూపీఐ యాప్ లో ఇది ఉందేమో చెక్ చేసుకోవచ్చు.

Also Read : జగన్‌కు కోర్టు షాక్.. లండన్ పర్యటనకు బ్రేక్!

#upi-payment #upi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి