/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/JOBS-2-jpg.webp)
SSC GD Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించే బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కేంద్రంలోని సాయధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లోని పలు విభాగాల్లో మొత్తం 26,146 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనవరి 1 రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చని ఎస్ ఎస్ ఎస్సీ తెలిపింది. ఆన్ లైన్ విధానం ద్వారా పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు భాషతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనుంది. కేంద్ర సాయుధ బలగాలతోపాటు ఎన్ఐఏ (NIA), ఎస్ఎస్ ఎఫ్ (SSF), అస్సాం రైపిల్స్ లోనూ ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టుల వారీగా వివరాలు :
పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. https://ssc.nic.in/
జీత భత్యాలు:
పే లెవల్ 3 కింద రూ. 21,700 నుంచి రూ. 69,100 చెల్లిస్తారు.
వయస్సు :
జనవరి 1. 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు మించి ఉండకూడదు. వర్గాల వారీగా వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
రూ. 100 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ, వైద్య పరీక్షల ఆధారం అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉండనుంది. 60 నిమిషాల పాటు ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు 160 మార్కులకు గాను నిర్వహిస్తారు. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటికస, ఉంటాయి.
ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని జాగ్రత్తగా రాయాలి.
ఇది కూడా చదవండి: మోదీ సంచలన నిర్ణయం..ఎస్సీ వర్గీకరణపై కమిటీకి ఆదేశం..!!