Constable Jobs 2023: టెన్త్ అర్హతతో 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త!

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 24 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

New Update
Indian Army Recruitment 2024 : గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

SSC GD Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించే బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కేంద్రంలోని సాయధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లోని పలు విభాగాల్లో మొత్తం 26,146 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనవరి 1 రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చని ఎస్ ఎస్ ఎస్సీ తెలిపింది. ఆన్ లైన్ విధానం ద్వారా పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు భాషతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనుంది. కేంద్ర సాయుధ బలగాలతోపాటు ఎన్ఐఏ (NIA), ఎస్ఎస్ ఎఫ్ (SSF), అస్సాం రైపిల్స్ లోనూ ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్టుల వారీగా వివరాలు : 

publive-image

పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. https://ssc.nic.in/

జీత భత్యాలు:
పే లెవల్ 3 కింద రూ. 21,700 నుంచి రూ. 69,100 చెల్లిస్తారు.

వయస్సు :
జనవరి 1. 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు మించి ఉండకూడదు. వర్గాల వారీగా వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
రూ. 100 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ, వైద్య పరీక్షల ఆధారం అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉండనుంది. 60 నిమిషాల పాటు ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు 160 మార్కులకు గాను నిర్వహిస్తారు. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటికస, ఉంటాయి.

ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని జాగ్రత్తగా రాయాలి.

Download Notification PDF

ఇది కూడా చదవండి: మోదీ సంచలన నిర్ణయం..ఎస్సీ వర్గీకరణపై కమిటీకి ఆదేశం..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు