Actress Hema: నటి హేమకు మరోసారి నోటీసులు

నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న హాజరు కావాలని బెంగళూరు సీసీబీ నోటీసులు ఇచ్చింది.

New Update
Actress Hema: నేను రాలేను.. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.!

Actress Hema: నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న హాజరు కావాలని బెంగళూరు సీసీబీ నోటీసులు ఇచ్చింది. కాగా ఇదే కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా తాను ఈ నెల 27న విచారణకు హాజరు కాలేను అని హేమ బెంగళూరు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. విచారణకు తనకు మరి కొంత సమయం కావాలని ఆమె పోలీసులను కోరారు. ఈ కేసులో దూకుడు పెంచిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆమె విచారణకు హాజరు కావాలని నోటీసులు జాయ్ చేసింది. కాగా నటి హేమ విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

ఐదుగురు అరెస్ట్..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. రేవ్ పార్టీ కేసులో (Bangalore Rave Party) టాలీవుడ్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన 86 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పిటికే ఇదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు