TTD: టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఈవో కి నోటీసులు

టీటీడీ లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అదనపు మాజీ ఈవో ధర్మారెడ్డి కి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్‌ కౌంటర్‌!
New Update

TTD: గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై రెండు నెలలుగా విజిలెన్స్‌ అధికారులు పలు శాఖల్లో వివరాలు సేకరించారు.

నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి విజిలెన్స్‌ అధికారులు వివరాలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డిలకూ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలానే అంతకు ముందు చైర్మన్, ఈవోగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి అధికారులు వివరణ అడిగినట్లు సమాచారం.

సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు రూ.300 కోట్ల వరకూ ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తారు. అయితే ఈ క్రమంలో టెండర్లలో భారీ మొత్తంలో ముడుపులు పలువురు అధికారుల చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోవిందరాజస్వామి సత్రాలకు రూ.420 కోట్లు, స్విమ్స్‌కు రూ.77 కోట్లు, తిరుపతిలోని పలు చోట్ల రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు ..ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం ఇవ్వాలని అధికారులు అడిగారు.

Also Read: కేరళ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం…!

#ttd #notice #former-eo #former-chairman #visilence
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe