/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-violence.webp)
ఈశాన్యరాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. బిష్ణుపూ్ర జిల్లాలోని ఖోయిజామన్ తాబి అనే గ్రామంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి కొండలపై వచ్చిన దుండగులు దాడికి పాల్పడ్డారని..ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. తాము ఘటనాస్థలానికి చేరుకునేలోపు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని...ఆసమయంలో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
మణిపూర్ లో గత రెండు నెలల క్రితం మూసిన 2వ నెంబర్ జాతీయ రహదారిని కుకీ తెగలు తిరిగి తెరిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తితో కుంగ్ పోక్పీ జిల్లాలోని జాతీయ రహదారిని దిగ్బంధాన్ని విరమించుకుంటున్నట్లు కూకీ తెగలు వెల్లడించాయి. మణిపూర్ లో రెండు జాతీయ రహదారులు ఉండగా...ఇంఫాల్ నుంచి దిమాపూర్ వరకు ఎన్ హెచ్ 2, ఇంఫాల్ నుంచి జిరిబాబ్ వరకు ఎన్ హెచ్ 37 ఉంది. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నప్పటి నుంచి ఈ రెండు జాతీయ రహదారులను కుకీ నిరసనకారులు మూసివేశారు.