Snakes as dowry: కట్నంగా పాములు ఇవ్వాల్సిందే..లేకపోతే పెళ్లే జరగదు..ఎక్కడో తెలుసా?

ఛత్తీస్‌గఢ్‌ కోర్బాలోని సోహగ్‌పూర్ గ్రామంలో అల్లుడికి 21పాములను కట్నంగా ఇచ్చే సంప్రదాయాన్ని సావ్రా తెగలు పాటిస్తాయి. విషం లేని పాములను పట్టి, ప్రజలకు చూపించి.. వాటితో ఆడడమే వారి జీవనోపాధి. అందుకే అల్లుడికి పాములను కట్నంగా ఇస్తారు.

New Update
Snakes as dowry: కట్నంగా పాములు ఇవ్వాల్సిందే..లేకపోతే పెళ్లే జరగదు..ఎక్కడో తెలుసా?

చిత్రవిచిత్రాల సంప్రదాయాలకు పెట్టింది పేరు ఇండియా. ఇక్కడ ఒక్కో మతం ట్రెడిషన్‌ ఒక్కొలాగా ఉంటుంది.. ట్రైబల్స్‌(tribals) సంప్రదాయాలు మరో రకంగా ఉంటాయి. ఓ గ్రామంలో పాటించే ఆచారాలు మరో గ్రామంలో ఉండవు. గిరిజన తెగల విషయంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ ఒక్కరితో మరొకరికి పొలిక ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లు జరుపుకొనే తీరులో చాలా తేడా ఉంటుంది. సాధారణంగా పెళ్లి(marriage) సమయంలో అల్లుడికి కట్నంగా నగదు,బంగారం పొలాలు, ఇల్లు లేదా ఇతర ఆస్తులు ఇస్తుంటారు. ఇది మనమంతా చూసేదే..అయితే ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh) కోర్బాలోని సోహగ్‌పూర్ గ్రామంలో ఓ వింత ఆచారముంది. పెళ్లి సమయంలో అల్లుడికి పాములను(snakes) కట్నంగా ఇచ్చే సంప్రదాయం వీళ్లది. ఎందుకు అలా ఇస్తారో తెలుసా?

publive-image ప్రతీకాత్మక చిత్రం

పాములను కట్నంగా ఎందుకు ఇస్తారు?
ఛత్తీస్‌గఢ్‌ కోర్బాలోని సోహగ్‌పూర్ గ్రామంలో కుమార్తె వివాహం సమయంలో 21 పాములను కట్నంగా ఇస్తారు. సావ్రా సమాజంలో ఇది ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. దీనివల్ల అత్తమామల ఇంటికి ఐశ్వర్యం వస్తుందని వాళ్ల నమ్మకం. పాములను కట్నంగా ఇవ్వలేకపోతే అసలు పెళ్లే జరగదట.. ఒకవేళ సంప్రదాయానికి విరుద్ధంగా పాములను కట్నంగా ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే భర్త కొద్దీ రోజుల్లోనే చనిపోతాడని సావ్రా తెగ పెద్దలు చెబుతున్నారు. అలాంటి ఘటనలు గతంలో జరిగాయంటున్నారు. అందుకే కచ్చితంగా కట్నంగా 21పాములను ఇవ్వాల్సిందేనంటారు. తమ తాతల కాలంలో 60పాములను కట్నంగా ఇచ్చేవారని.. తర్వాత ఆ సంఖ్య తగ్గిపోతూ వచ్చిందట..!

అధికారులు ఏం అంటున్నారు?
పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని స్థానిక అధికారులు గౌరవిస్తారు. అయితే అదే సమయంలో పాములు పట్టేవారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. విషం లేని పాములను పట్టి, ప్రజలకు చూపించి.. వాటితో ఆడడమే వారి జీవనోపాధి. మనుషులకు ప్రమాదకరం కాబట్టి విషం లేని పాములను మాత్రమే పట్టుకోవాలని అధికారులు జాగ్రత్తలు చెబుతుంటారు. అటు కట్నంగా పాములను సమర్పించే ఆచారం ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు అధికారులు. సావ్రా తెగ జీవనోపాధి పాములే. అందుకే అల్లుడికి పాములను కట్నంగా ఇస్తారు. ఎక్కువ పాములు ఇస్తే వాళ్ల జీవితం బాగుంటుందన్నది నమ్మకం. ఆ పాములతోనే వాళ్లు జీవిస్తారు.. నిజానికి అధికారులు చెప్పినట్టు ఈ తెగ వాళ్లు విషంలేని పాములు పట్టరు.. విషం ఉన్నవే పడతారు.. కానీ తర్వాత వాటి విషం తీసేస్తారు. ఆ తర్వాతే ప్రజల్లోకి పాములను తీసుకెళ్తారు. ఈ విషమున్న పాములను పట్టే క్రమంలో కొంతమంది ప్రాణాలు పొగొట్టుకుంటాన్న మాట నిజమేనైనా.. అక్కడ చిన్నపిల్లలకు కూడా పాములు పట్టడం ఈజీగా వస్తుందట.!

Advertisment
Advertisment
తాజా కథనాలు