Joe Fazer : ప్రపంచంలోని ప్రతి మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజంతా పరుగెత్తి పని చేసినా నిద్రపోకపోతే శరీరం అలసిపోతుంది. నిద్ర సరిగా లేకపోతే గుండెపోటు(Heart Attack), రక్తపోటు లాంటి సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది సరైన నిద్రలేక మందులు వేసుకుంటూ ఉంటారు. ప్రయాణాల సమయంలో లేదా ఏదైనా పని చేసినప్పుడు నిద్ర లేకపోతే తర్వాత రోజు నిద్రలేమికి గురవుతూ ఉంటారు.
నో స్లీప్ ఛాలెంజ్ వీడియోను:
- చెన్నై(Chennai) కి చెందిన ఓ యూట్యూబర్(Youtuber) నో స్లీప్ ఛాలెంజ్(No Sleep Challenge) పేరుతో నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉండగలనో చూద్దామని అనుకున్నాడు. కేవలం చాలెంజ్ మొదలుపెట్టి 42 గంటల్లో మాత్రమే నిద్రపోకుండా ఉండగలిగాడు. జో పేసర్ అనే యూట్యూబర్ నో స్లీప్ ఛాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తరచుగా హెల్త్ వీడియోలను షేర్ చేసే జో పేసర్(Joe Fazer).. ఇప్పుడు ఎంతసేపు మెలకువగా ఉండగలనో ట్రై చేసి చూడబోతున్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. చాలా బాగా అలసిపోయి.. చివరికి ఏం జరిగిందో మరో వీడియోలో వివరంగా చెప్పాడు.
చివరికి స్పృహతప్పి పడిపోయాడు
- మొదటి 18 గంటలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండగలిగానని, ఆ తర్వాత కాస్త అలసట అనిపించందని చెప్పాడు. 22 గంటల తర్వాత ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత కాస్త రిఫ్రెష్‌మెంట్ వచ్చిందని, 29 గంటల తర్వాత చల్లటి నీళ్లలో స్నానం చేశానని చెప్పాడు. కానీ 30 గంటల తర్వాత పూర్తిగా అలసిపోయినట్టు పేర్కొన్నాడు. తర్వాత కొంత వ్యాయామం చేశానని, 33 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, 36 గంటల తర్వాత రెండోసారి కాఫీ తాగానని యూట్యూబర్ చెప్పాడు. ఎంత నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నించినా 42 గంటల తర్వాత చివరికి స్పృహతప్పి పడిపోయానని చెప్పాడు. సోషల్ మీడియా(Social Media) లో ఈ వీడియో మొత్తం పోస్ట్ చేసిన జో పేసర్.. దీన్ని ఎవరూ ప్రయత్నించొద్దని సలహా ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: ఏ సమయంలో చదివితే పిల్లలకు చదివింది గుర్తుంటుంది..? ఏకాగ్రత పెంచే చిట్కాలు..!
ఇది కూడా చదవండి: రక్తంలో గడ్డలను కరిగించే నిరంజన్ ఫల్ గురించి విన్నారా..?