కోవాక్సిన్ తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..ICMR

కోవాక్సిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 30 శాతం మందికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని బనారస్‌ యూనివర్సిటీ  ప్రచురించిన నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తోసిపుచుంది.వెంటనే ఈ నివేదికను ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బనారస్ యూనివర్సిటీకి ICMR హెచ్చరించింది.

కోవాక్సిన్ తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..ICMR
New Update

కోవాక్సిన్ అనే యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి నాడీ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, కీళ్ల దృఢత్వం, కండరాల తిమ్మిర్లు మరియు మహిళల్లో రుతుక్రమంలో మార్పులు ఉన్నాయని బనారస్ యూనివర్సిటీ ఒక నివేదికను ప్రచురించింది.దీనిపై  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇలా స్పందించింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఒక ప్రకటనలో ఇలా వివరించింది. కోవాక్సిన్ వ్యాక్సిన్‌కు సంబంధించి బనారస్ విశ్వవిద్యాలయం  ఇటీవలి అధ్యయనానికి వారు ఎటువంటి ఆమోదం పొందలేదు.టీకా తీసుకున్న వారిలో దాదాపు 30% మంది స్ట్రోక్, న్యూరోలాజికల్ డిజార్డర్స్ లేదా శ్వాసకోశ సమస్యలతో సహా సమస్యలను ఎదుర్కొన్నారని అధ్యయనం నివేదించింది.

సరైన అధ్యయనం చేయకుండానే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని బనారస్ యూనివర్శిటీ తప్పుడు నివేదికలు ప్రచురించందని..ICMR పేర్కొంది. వెంటనే నివేదికపై సమాధానం ఇవ్వాలని లేకపోతే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

#icmr #covaccin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe