రాత్రి నిద్రపోయే ముందు చూస్తే వర్షం దంచికొడుతోంది.. ఉదయం లేచి చూస్తే బాది పడేస్తోంది.. ఈ వర్షం తగ్గలేదా అని అనుకుంటేనే ఫోన్‌కి ఏమైనా మెసేజులు వచ్చాయేమోనని చూశారు తల్లిదండ్రులు. వర్షం కారణంగా స్కూల్ లేదన్న మెసేజ్ కనిపిస్తుందని భావించారు. కానీ అలాంటి మెసేజులు ఏమీ కనపడకపోవడంతో పిల్లలను స్కూల్‌కి రెడీ చేశారు. స్కూల్ బస్సు కూడా వచ్చేసింది. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షంలో గతుకుల రోడ్లలో.. వర్షపు నీరు నిలిచి కనపడకుండా ఉన్న గుంటల్లో ప్రయాణించిన బస్సు స్కూల్‌కి చేరుకుంది.. తీరా స్కూల్‌కి వెళ్లిన కాసేపటికి ఇవాళ, రేపు సెలవు అని సర్క్యూలర్ వచ్చింది. మళ్లీ అదే బస్సులో ఇంటికి వెళ్లిపోయారు పిల్లలు.. అటు స్కూల్ బస్ సదుపాయం లేని వాళ్లని తమ తల్లిదండ్రులే దింపగా..తిరిగి ఇంటికి వెళ్లే దారిలోనే స్కూల్‌కి సెలవు అని తెలిసింది. దీంతో మళ్లీ రిటర్న్ వచ్చి తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఇవాళ ఉదయం తెలంగాణలోని చాలా చోట్ల కనిపించిన దృశ్యాలు ఇవి.
పూర్తిగా చదవండి..Telangana Rains: ఇంత లేట్‌గా చెబితే ఎలా సర్..? ఆలస్యంగా సెలవుల ప్రకటనపై తల్లిదండ్రుల అసంతృప్తి..!
తెలంగాణలో 48గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండగా.. స్కూల్స్, కాలేజీల సెలవు ప్రకటన ఆలస్యంగా రావడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Translate this News: