Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్! మధ్యంతర బడ్జెట్‌లో పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది. By Trinath 01 Feb 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Bad News For Famers: రైతులకు, సామాన్యులకు మధ్యంతర బడ్జెట్(Interim Budget-2024) నిరాశ మిగిల్చింది. పీఎం కిసాన్ పెంపు ఊసే లేకుండా నిర్మలమ్మ బడ్జెట్ కాపీని చదివేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈసారి రైతులకు గుడ్‌న్యూస్ ఉంటుందని అన్నదాతలు ఆశించారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని రైతులు భావించారు. అయితే అలాంటివేమీ లేకుండా మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు ఆర్థిక మంత్రి. ఎలాంటి ప్రకటనా లేదు: పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకాలలో ఒకటి. PM-కిసాన్ పథకం కింద, ప్రభుత్వం మూడు సమాన నెలవారీ వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సొమ్మును 'డీబీటీ' ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 2019 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ప్రభుత్వం కృషి చేసిందని మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార ధాన్యాల ఆందోళనలను తొలగించే పని మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినట్టు చెప్పారు. కనీస అవసరాలు తీరాయని, దీని వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగిందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే దేశమని తెలిపారు. కానీ జంతువుల ఉత్పాదకత చాలా తక్కువగా ఉందని.. పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. Also Read: వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం WATCH: #union-budget-2024 #pm-kisan #interim-budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి