NO Petrol: వాహనదారులకు షాక్.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!

హైదరాబాద్ లో మూడో రోజు కూడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చాయి. కొన్ని బంకుల్లో నార్మల్ పెట్రోల్ బదులు XP 100 పెట్రోల్ స్టాక్ ఉంది. దీని ధర రూ.160. దీంతో వాహనదారులు చేసేదేమి లేక ఈ పెట్రోల్ నే కొట్టించుకుంటున్నారు.

New Update
NO Petrol: వాహనదారులకు షాక్.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!

Liter Petrol Price Rs.160 At Hyderabad: పెట్రోల్ కొరతతో దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇబ్బందిగా మారింది. లారీ డ్రైవర్లు సమ్మెను ఉపసంహరించుకున్న సరే పెట్రోల్, డీజిల్ కొరత తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మూడో రోజు కూడా వాహనదారులకు ఇబ్బంది తగ్గలేదు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరో కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ స్టాక్ లేకపోవడంతో గత మూడు రోజులుగా బంకులు మూతపడ్డాయి. దీన్నే మంచి అవకాశం అనుకున్నారో ఏమో తెలీదు కానీ, స్టాక్ ఉన్న బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి బ్లాక్ లో పెట్రోల్ అమ్ముకుంటున్నారని బయట టాక్ వినిపిస్తుంది.. అది మీ వరకు మేము చేరుస్తున్నాం.

ALSO READ: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్!

ఏందయ్యా ఇది.. లీటర్ పెట్రోల్ రూ.160/-..

బంకుల్లో పెట్రోల్ స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. పడుతూనే ఉన్నారు అని చెబుతూనే ఉన్నాం.. మీరు చూస్తూనే ఉన్నారు. అయితే కొన్ని బంకుల్లో నార్మల్ పెట్రోల్ స్టాక్ లేకపోవడంతో XP100 పెట్రోల్, XP95 పెట్రోల్ లే దర్శనమిస్తున్నాయి. అయితే, అందులో ఏముంది అని అనుకుంటున్నారా? .. అదేమీ లేదండి లీటర్ XP100 పెట్రోల్ ధర రూ.160 మాత్రమే. సామాన్యంగా లీటర్ పెట్రోల్ రూ.110 లకే అందుబాటులో ఉండేది. అయితే నార్మల్ పెట్రోల్ లేక ఎక్స్ట్రా పవర్ పెట్రోల్ స్టాక్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. దీంతో చేసేది ఏమి లేక 2 లీటర్లు కొట్టించుకుందాం అని పెట్రోల్ బంకులకు వెళ్ళినవారు ఆ ధరలు చూసి ఒక లీటర్ కొట్టించుకొని వెళ్లిపోతున్నారు.

హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ పెట్రోల్ బంకులో.. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ పెట్రోల్ బంకులో..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు