/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-6-jpg.webp)
Pawankalyan: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మద్దతు తెలిపేందుకు విజయవాడకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట చేరుకున్నారు. అయితే పవన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. దీంతో అధికారులు ఆయన విమానం టేకాఫ్‌కు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పవన్ కళ్యాణ్‌కు అనుమతినివ్వడం లేదని పోలీసులు తెలిపారు.
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు అంటే ఎందుకింత భయం?
ఆయన పార్టీ కార్యక్రమాలకి ఆయన వెళ్లకుండా అడ్డుకోవడమేనా ప్రజాస్వామ్యం?శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టకుండా చూడాలని కృష్ణా జిల్లా SP రాసిన లేఖ ఇది pic.twitter.com/Z2uE9LE3RW
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
పోలీసుల తీరుపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ అధినేత పార్టీ కార్యక్రమాల కోసం అమరావతి వస్తుంటే ఎందుకు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయలంలో నేతలతో సమావేశం ఉందని.. అవసరమైతే రోడ్డు మార్గాన పవన్ కల్యాణ్ అమరావతి వస్తారని చెబుతున్నారు. దేశంలోనే నిజాయతీ, నిబద్ధత కలిగిన రాజకీయ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయటం దారుణమని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని వ్యక్తిగతంగా కలిసి పరామర్శించడానికి తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వస్తుంటే.. ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. విజయవాడ రావడానికి బేంగపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత అనుమతి లేదని చెప్పడం దుర్మార్గమన్నారు.
ఏం ప్యాకేజ్ స్టార్ @PawanKalyan గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ మీద గతనెల 4న @ncbnకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే దాని మీద కనీసం స్పందించ లేదు. విచారణకు హాజరుకాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతుంటే ఎందుకని ప్రశ్నించలేదు. అలాంటిది స్కిల్ డెవలప్మెంట్ అని యువతను మోసం చేసి,…
— YSR Congress Party (@YSRCParty) September 9, 2023
మరోవైపు వైసీపీ పార్టీ, జనసేన పార్టీలు ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. "ఏం ప్యాకేజ్ స్టార్ పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ మీద గతనెల 4న చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే దాని మీద కనీసం స్పందించ లేదు. విచారణకు హాజరుకాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతుంటే ఎందుకని ప్రశ్నించలేదు. అలాంటిది స్కిల్ డెవలప్మెంట్ అని యువతను మోసం చేసి, దోచుకున్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేస్తే షూటింగ్‌లు కూడా క్యాన్సిల్ చేసుకుని, పొలోమని పరిగెత్తుకొస్తున్నావు. పొద్దున జరిగిన అరెస్ట్ మీద స్పందించేందుకు అప్పుడే నీకు ప్యాకేజీ అందేసిందా? ఇంతకీ అది గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌ల సొమ్మేమో చూడు." అని వైసీపీ పార్టీ అధికారిక పేజీలో ట్వీట్ చేసింది.
ప్రాథమిక ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానంలో తప్పులు ఉన్నాయి. దానిని ఖండించడం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదుల కనీస బాధ్యత. @PawanKalyan గారు చేసింది కూడా అదే.
శుక్రవారం సూరీడుకి రాజ్యాంగం తెలీదు, చట్టం తెలీదు.. కక్ష సాధింపు చర్యలు మినహా బాబాయ్ హత్య… https://t.co/YnwkTO1HnZ
— JanaSena Shatagni (@JSPShatagniTeam) September 9, 2023
దీనికి అంతే బదులుగా జనసేన పార్టీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. "ప్రాథమిక ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానంలో తప్పులు ఉన్నాయి. దానిని ఖండించడం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదుల కనీస బాధ్యత. పవన్ కల్యాణ్ గారు చేసింది కూడా అదే. శుక్రవారం సూరీడుకి రాజ్యాంగం తెలీదు, చట్టం తెలీదు.. కక్ష సాధింపు చర్యలు మినహా బాబాయ్ హత్య విషయంలో, కోడి కత్తి విషయంలో కూడా ఇంతలా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టులకు ఎందుకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు? బాబాయ్ కేసు విచారణ జరుగుతుంటే జగన్ ఎందుకు ఉలిక్కి పడ్డాడు? దీనికి సమాధానం ఉందా? అన్నట్టు కోడి కత్తి కేసులో జగన్ కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చేది ఉందా లేదా జూ. సజ్జల" అంటూ ట్వీట్ చేసింది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు విజయవాడకు పవన్ కల్యాణ్