శ్రీవారి లడ్డూతో ‘నెయ్యి’ నెయ్యం చెడింది..!?

తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? అంటే..అవుననేలాగే ఉన్నాయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కెఎమ్ ఎఫ్)వ్యాఖ్యలు.నెయ్యి సరఫరా ధరకు సంబంధించిన ఎలాంటి సంతృప్తికరమైన కొటేషన్ ను టీటీడీ ఇంత వరకూ తమకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదని కెఎమ్ఎఫ్ తెలిపింది.ఈ మేరకు ఆదివారం మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.కెఎమ్ఎఫ్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు. దీనికి టీటీడీ స్పందించింది. టీటీడీ ఛైర్మన్ ధర్మారెడ్డి మాట్లాడుతూ కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి‌ నెయ్యి మాత్రమే కొనలేదన్నారు.టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

శ్రీవారి లడ్డూతో ‘నెయ్యి’ నెయ్యం చెడింది..!?
New Update

తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? అంటే..అవుననేలాగే ఉన్నాయి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కెఎమ్ ఎఫ్)వ్యాఖ్యలు.

శ్రీవారి లడ్డు కోసం గత ఏభై ఏళ్లుగా సప్లై చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని ఫెడరేషన్  నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది.నెయ్యి సరఫరా ధరకు సంబంధించిన ఎలాంటి సంతృప్తికరమైన కొటేషన్ ను టీటీడీ ఇంత వరకూ తమకు ఎలాంటి అధికారక సమాచారం ఇవ్వలేదని కెఎమ్ఎఫ్ తెలిపింది.

ఈ మేరకు ఆదివారం మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడు భీమ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.దక్షిణ భారత దేశంలో తిరుమల తిరుపతి ఎంతటి ప్రసిద్ధి చెందిందో...శ్రీవారి లడ్డూ కూడా అంత ప్రసిద్ధి. ఫ్రెండ్స్, కావచ్చు ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు,కాస్త చనువున్న ఆఫీస్ బాస్ కావచ్చు...తిరుపతి వెళ్లొచ్చామని చెబితే చాలు.

publive-image

ఏది మాకు లడ్డు ప్రసాదం పెట్టవా..అంటూ నిర్మొహమాటంగా అడుగుటుంటారు. మన మీద ప్రేమతో కాదండోయ్...శ్రీవారి ప్రసాదం లడ్డూ మీదున్న ఇష్టంతో.! మొహమాటం లేకుండా అడిగేసే వారికోసమైనా స్తోమతను బట్టి రెండోమూడో లడ్డూలు ఎక్కువ తీసుకుంటాం.

శ్రీవారి లడ్డూకి ఉండే కమ్మటి వాసన అందులో వేసే స్వచ్ఛమైన ఆవు నెయ్యి నుంచే వస్తుంది,కమ్మటి నెయ్యి కలవడం వల్ల లడ్డూకి రుచితితో పాటు నిల్వసామర్ధ్యం కూడా పెరుగుతుంది.లడ్డు నాణ్యతా ప్రమాణాలలో ముఖ్య పాత్రపోషించే నందిని నెయ్యిని గత యాభై ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేస్తూవస్తోంది.

అయితే ప్రస్తుతం టీటీడీ రూటు మార్చి వేరే మిల్క్ ప్రొడక్షన్ కంపెనీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తోందని కెఎమ్ఎఫ్ అధ్యక్షుడు భీమనాయక్ అన్నారు. తాము సప్లేచేసే నెయ్యికి ఎక్కువ ధరను డిమాండ్ చేయడంతో టీటీడీ సంస్థను మార్చేసన్నాహాలు చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఈ- ప్రొక్యూర్ మెంట్ విధానం ద్వారా తక్కువ ధరకు సప్లైచేసే సంస్థకు బాధ్యతలు అప్పగిస్తుస్తామని టీటీడీ చెబుతోందన్నారు. తమ ఫెడరేషన్ సప్లైచేసే నందిని నెయ్యికి అంతర్జాతీయ మార్కెట్ ఉందన్నారు.

టీటీడీ వారు చెప్పినట్టు ఎవరైనా శ్రీవారికి నెయ్యి సప్లై చేయవచ్చు కాకపోతే నాణ్యతలో రాజీపడడం ఖాయమని భీమనాయక్ అన్నారు.అయితే దీనికి టీటీడి ఈవో ధర్మారెడ్డి స్పందించారు.

publive-image

కెఎమ్ఎఫ్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు.వారు చెప్పినట్టుగా టీటీడీ సంస్థ నేరుగా నందిని నెయ్యి ఎప్పుడూ కొనుగొలు చేయలేదన్నారు.

కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి‌ నెయ్యి మాత్రమే కొనలేదు..పలు టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని తెలిపారు.

#no-ghee-to-ttd-laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి