TS Free Power Scheme : తెలంగాణలో వారికి ఇక ఉచిత కరెంట్.. రూల్స్ ఇవే! రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఫ్రీ పవర్ హామీ అమలుపై దృష్టి సారించింది. తెలంగాణకు చెందిన వారు మాత్రమే నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు తో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా నిబంధనలను అధికారులు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి T - Sarkar : తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరింది.మహిళలకు ఫ్రీగా బస్సు పథకం షురూ అయ్యింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నారు. మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది 200యూనిట్ల లోపే కరెంట్ వాడుతున్నారు. వారందరీకి ఫ్రీగా కరెంట్ ఇచ్చే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 ప్రారంభమైన ఈ పథకానికి మహిళల నుంచి ఆపూర్వ స్పందన వస్తోంది. ఉచిత ప్రయాణ సౌకర్యం బాగున్నా...మరి ఫ్రీ విద్యుత్ ఎప్పటి నుంచే అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపైన్నే జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్(Congress) పార్టీ. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద..ప్రతి కుటుంబానికి రూ. 10లక్షల బీమా అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు ఈ రెండు పథకాలు ప్రారంభం అయ్యాయి. మరి మిగతా పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో గృహజ్యోతి పథకం ఎంతో కీలకమైంది. ఎన్నికల ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను ఆకట్టుకుంది. గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతుంటారు. అందుకే మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి కరెంట్ బిల్లు సున్నాగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గృహజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఉంటుందా లేదంటే ఇంకా సమయం పట్టే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎన్నికల ప్రచారంలో కరెంటు బిల్లులపై పలు సందర్బాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ నుంచే కరెంట్ బిల్లులను మాఫీ చేస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇదే నెలలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించాలన్న డిమాండ్స్ కూడా భారీగానే వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ నెల కరెంట్ బిల్లులు కట్టాలా వద్దా అనే సందేహంలో ప్రజల్లో నెలకొంది. అధికారులు మాత్రం గృహజ్యోతి పథకం ఇంకా ప్రారంభం అవ్వలేదని..దానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. అప్పటివరకు వరకు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మన దేశంలో అమ్మకాల్లో దుమ్ము లేపుతున్న టాప్ 20 కార్లు ఇవే! #ts-free-power-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి