'ఎవరు ఏం చెప్పినా ఎన్సీపీ అధ్యక్షుడిని నేనే : శరద్ పవార్..!! తిరుగుబాటు పార్టీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై దావా వేసిన తర్వాత ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో కార్యవర్గం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షిండే ప్రభుత్వంలో చేరిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. By Bhoomi 06 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజిత్ పవార్ వర్గానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. షిండే ప్రభుత్వంలో చేరిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే సహా, 9 మంది ఎమ్మెల్యేలను శరద్ పవార్ పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు ముంబైలో అజిత్ పవార్ కూమా సమావేశం నిర్వహించారు. ఎన్డీయేలో చేరిన ఆర్ఎస్పీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే ఈరోజు అజిత్ పవార్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. వీరితో పాటు పలువురు నేతలతో అజిత్ పవార్ భేటీ అయ్యారు. 'ఎవరు ఏం చెప్పినా ఎన్సీపీ అధ్యక్షుడిని నేనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ పార్టీ నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు జాతీయ కార్యవర్గ సమావేశం దోహదపడిందన్నారు. ఎవరేం మాట్లాడినా..చెప్పినా ఇప్పటికీ ఎన్సీపీ అధ్యక్షుడిని నేనే అంటూ వ్యాఖ్యానించారు శరద్ పవార్. "నాకు 82 ఏళ్లు వచ్చినా, 92 ఏళ్లు వచ్చినా నేను ఇంకా ఎఫెక్టివ్‌గా ఉన్నాను. ఈరోజు జరిగిన సమావేశం మా మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఎంతో సహాయపడింది" అని పవార్ పేర్కొన్నారు. Your browser does not support the video tag. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్, “నేను ఎన్సీపీ అధ్యక్షుడిని, ఎవరైనా (అతను అధ్యక్షుడని) చెబితే అది పూర్తిగా అబద్ధం, అందులో నిజం లేదన్నారు. అజిత్ పవార్ చెప్పివన్నీ పూర్తిగా అబద్దలే అంటూ కొట్టిపారేశారు. మేము భారత ఎన్నికల సంఘాన్ని పూర్తిగా విశ్వసిస్తాము. మేము ఏదైనా మాట్లాడాలనుకున్నా...చెప్పాలనుకున్నా ఈసీకి వెల్లడిస్తామని చెప్పారు. 8 తీర్మానాలు ఆమోదం: ఎన్సీపీ వర్కింగ్ కమిటీ 8 తీర్మానాలను ఆమోదించిందని, పార్టీ అధినేత శరద్ పవార్‌పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం పీసీ చాకో తెలిపారు. తిరుగుబాటు పార్టీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై దావా వేసిన తర్వాత ఢిల్లీలో సమావేశం జరిగింది .“పార్టీకి చెందిన 27 రాష్ట్ర కమిటీల్లో ఒక్కటి కూడా శరద్ పవార్‌తో లేమని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, చేతులు కలిపిన 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తూ శరద్ పవార్ తీసుకున్న నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. శరద్ పవార్ పై అజిత్ పవార్ ఫైర్: ‘‘అందరి ముందు నన్ను విలన్‌గా చూపించావు.. ఆయన (శరద్‌పవార్)పై ఇప్పటికీ నాకు చాలా గౌరవం ఉంది.. అయితే మీరు చెప్పండి, ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారు.. రాజకీయాల్లో కూడా - బీజేపీ నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీల ఉదాహరణను చూడొచ్చు.. అది కొత్త తరాన్ని ఎదగడానికి వీలు కల్పిస్తుంది.. మీరు (శరద్ పవార్) మాకు మీ ఆశీస్సులు అందించండి’’అంటూ శరద్ పవార్ వయస్సుపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ల కలకలం: గురువారం ఉదయం, శరద్ పవార్ ఢిల్లీ నివాసం వెలుపల శరద్ పవార్ వర్గం అజిత్ పవార్‌ను ద్రోహి అంటూ విమర్శించింది. పార్టీపై నియంత్రణ సాధించేందుకు అజిత్ పవార్ చేసిన ఎత్తుగడ, బ్లాక్‌బస్టర్ మూవీ బాహుబలిలో పురాణ ద్రోహం మధ్య సమాంతరంగా పవార్ వర్గం అతని ఢిల్లీ నివాసం వెలుపల పోస్టర్‌లను అతికించింది. ఒకే కుటుంబం చేతిలో నడిచే రాజకీయపార్టీలో వెన్నో పోటు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత కుటుంబ సభ్యులే వెన్నుపోటు కట్టప్పలుగా మారుతున్నారంటూ పోస్టర్లు వెలుస్తున్నాయి."దేశం మొత్తం తమలో దాగి ఉన్న ద్రోహులను చూస్తోంది. ఇలాంటి మోసగాళ్లను ప్రజలు క్షమించరు" అని పోస్టర్‌లో శరద్ పవార్, అజిత్ పవార్‌లను పోలి ఉండేలా ఎన్‌సిపి విద్యార్థి విభాగం పోస్టర్లను అతికించింది. ఎన్సీపీ గుర్తు నా వద్దే ఉంటుంది: ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం తన వద్దే ఉంటుందని, దానిని ఎవరూ లాక్కోలేరని శరద్ పవార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తిరుగుబాటు NCP నాయకుడు అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి, పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై దావా వేసిన తర్వాత శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి