Holidays: ఇన్ కమ్ టాక్స్ ఆఫీసులకు శని, ఆదివారాల్లో కూడా సెలవు లేదు.. ఎందుకంటే.. 

ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకూ వరుసగా నాలుగురోజుల పాటు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు లాంగ్ వీకెండ్ వచ్చింది. అయితే, ఐటీ రిటర్న్స్ కోసం చివరితేదీ మార్చి 31 కావడంతో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలన్నీ తెరిచే ఉంటాయి.

Holidays: ఇన్ కమ్ టాక్స్ ఆఫీసులకు శని, ఆదివారాల్లో కూడా సెలవు లేదు.. ఎందుకంటే.. 
New Update

Holidays: ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో శని, ఆదివారాలు సెలవులు. అయితే ఈ నెలాఖరులో వచ్చే శని, ఆదివారాల్లో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలకు సెలవు ఉండదు. అంటే మార్చి 31 ముందు వచ్చే శని, ఆదివారాల్లో ఆ ఆఫీసులు అన్నీ తెరిచి ఉంటాయి. వాస్తవానికి, ఆదాయపు పన్ను శాఖలో చాలా ఫిర్యాదులు .. పని పెండింగ్‌లో ఉన్నాయి.  దీని కోసం దేశవ్యాప్తంగా అన్ని ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 29, 30, 31-2024న తెరిచి ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 119 కింద అందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అధికారాలను అమలు చేయడంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. 

లాంగ్ వీకెండ్ ప్రభావం ఉండదు
మార్చి చివరి వారంలో లాంగ్ వీకెండ్(Holidays) ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అన్నీ మూసి ఉంటాయి. అయితే, సెలవు ఉన్నప్పటికీ ఆదాయపు పన్నుశాఖ కార్యాలయాలు, ఆదాయపు పన్ను సేవా కేంద్రాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను ఎలాంటి ఆలస్యం లేకుండా సులభంగా ఫైల్ చేయవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 29 నుండి ఏప్రిల్ 1 వరకు మూసివేసి ఉంటాయి. ఎందుకంటే,  మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, శని-ఆదివారం సెలవుల(Holidays) కారణంగా ఇది చాలా పెద్ద వీకెండ్ కానుంది. అంటే నాలుగురోజుల పాటు వరుస సెలవులు వచ్చాయి. కానీ, జాతీయ మీడియా నివేదిక ప్రకారం, ఈ ఆదాయపు పన్ను కార్యాలయాలు, ఆదాయపు పన్ను సేవా కేంద్రాలు సెలవు ఉన్నప్పటికీ తెరిచి ఉంటాయి. 29 నుంచి 31 వరకు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేస్తారు. అయితే, సెలవురోజులు అయినప్పటికీ ఆదాయపు పన్ను కార్యాలయాలు(Holidays) మాత్రం తెరిచే ఉంటాయి. 

Also Read: ప్రభుత్వానికి డబ్బే డబ్బు.. పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. ఆ లెక్కలివే!

సెలవు రోజుల్లో కూడా పనులు జరుగుతాయి
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీకు చివరి అవకాశం మార్చి 31 వరకూ మాత్రమే ఉందని తెలిసిందే. అటువంటి పరిస్థితిలో, ప్రజలు రిటర్న్‌లను దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గాను  ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలను తెరిచి ఉంచుతోంది. అందువల్ల మీరు మీ ఆదాయపు పన్ను సంబంధిత పనులను 29 నుండి 31 వరకు పూర్తి చేసుకోవచ్చు. 

#income-tax-department #long-weekends
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe