డీజే నాట్ అలౌడ్..అక్కడ పెళ్లి చేసుకునే వారికి షాక్..!! టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే వారికి షాక్. ఇకపై కల్యాణ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేయడం కుదరదంటూ టీటీడీ పాలకమండలి తేల్చి చెప్పేసింది. కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే పర్మిషన్ అంటూ ప్రకటించింది. ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. By Jyoshna Sappogula 09 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే వారికి షాక్. ఇకపై కల్యాణ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేయడం కుదరదంటూ టీటీడీ పాలకమండలి తేల్చి చెప్పేసింది. కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే పర్మిషన్ అంటూ ప్రకటించింది. తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో టీటీడీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వారికి రూ.12 వేలు ఇస్తుండగా, ఇకపై వారికి రూ.17 వేల వేతనం ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంతో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు లబ్ది పొందనున్నారు. అంతేకాదు, టీటీడీ పరిధిలోని కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను ప్రతి ఏడాది 3 శాతం పెంచాలని బోర్డు నిర్ణయించింది. కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు ఆకస్మిక మరణం చెందితే రూ.2 లక్షల పరిహారం, కార్పొరేషన్ లో పనిచేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తింపు నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్ మెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.40 కోట్లు వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.10.8 కోట్లు తిరుపతి చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు నారాయణ గిరిలోని హోటళ్లు, అన్నమయ్య భవన్ లోని హోటళ్ల నిర్వహణ బాధ్యత పర్యాటక శాఖకు అప్పగింత అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ. భక్తులు కూడా ఈ హోమంలో స్వయంగా పాల్గొనే అవకాశం. ప్రాచీన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ టీటీడీ పరిధిలోకి... తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు టీటీడీ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయం ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరాలు తెలిపారు. Also Read: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన! #ttd #dj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి