Today Gold Rate: బంగారం ధరలు చాలా అస్థిరంగా కదులుతున్నాయి. ఒకరోజు తగ్గడం.. ఒకరోజు భారీగా పెరగడం.. ఒక్కోరోజు మార్పులేకుండా ఉండడం.. ఇలా ప్రతిరోజూ ధరల్లో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఇలా పైకీ కిందికీ కదులుతూ.. మొత్తంగా చూసుకుంటే పెరుగుదలనే కనబరుస్తున్నాయి. ఇక ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Today Gold Rate) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం ఈ నెలలో బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి21న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Today Gold Rate) భారీగా పెరిగింది. దేశీయంగా ఆ ఎఫెక్ట్ ఈరోజు కనిపించలేదు. దీంతో భారత్ లో బంగారం ధరల్లో మార్పులు రాలేదు. మరోవైపు వెండి ధరలు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే గురువారం (మార్చి21) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్నపెరిగిన బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా నిలిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike) రూ.60,860ల వద్దఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.66,330ల వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఎలాంటి మార్పులు లేకుండా (Gold Rates Hike) రూ.60,950ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ కూడా స్థిరంగా రూ.66,480ల వద్ద నిలిచింది.
Also Read : ఒక్కరోజు మురిపెమే..బంగారం ధరలు మళ్ళీ పెరిగాయ్!
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Today Gold Rate) లో మార్పు లేకుండా ఉంటె, వెండి మాత్రం కాస్త తగ్గింది. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు తగ్గి రూ.80,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 300 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 77,000ల వద్దకు చేరుకుంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 40 డాలర్లు వరకూ పెరిగింది. దీంతో 2204.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 25.70 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.
స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గినా వెండి ధరలు.. హైదరాబాద్ లో 10 గ్రాములకు ఈరోజు బంగారం ధరలు : 22 క్యారెట్లు రూ.60,860లు.. 24 క్యారెట్లు రూ.66,480లు.. వెండి కేజీ రూ.80,000లు