Gold Rates Today: గత వారమంతా మోత మోగించిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే.. 

గత వారంలో వరుసగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడంతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి  రూ.79,100 వద్ద ఉంది.

New Update
Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

Gold Rates Today: బంగారం ధరలు గత వారంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోయాయి. సామాన్యులు కనీసం బంగారం పేరు తలిచే సాహసం కూడా చేయలేనంతగా బంగారం ధరల్లో పెరుగుదల వచ్చింది. వారం ప్రారంభంలో అంటే మార్చి 4వ తేదీ సోమవారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 64,090 రూపాయలుగా ఉంది. అది వారాంతానికి అంటే ఆదివారం మార్చి 10వ తేదీ నాటికి క్రమేపీ పెరుగుతూ 66,270 రూపాయలకు చేరుకుంది. అంటే, 2,180 రూపాయలు పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి మొత్తంగా చూసుకుంటే అంటే మొదటి పది రోజుల్లోనూ బంగారం ధర దాదాపుగా మూడువేల రూపాయల వరకూ బంగారం ధర(Gold Rates Today) పెరిగింది. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వార్తల నేపథ్యంలో గత పదిరోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి11న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rates Today) నిలకడగా ఉంది.   మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు అంటే సోమవారం (మార్చి11) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rates Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                         

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Today) రూ.60,750ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.66,270ల వద్ద స్థిరంగా ఉంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold Rates Today) రూ.60,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,420లుగా మార్పులు లేకుండా ఉంది.   

Also Read : వామ్మో.. పరుగు ఆపని పసిడి.. ఈరోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Hike)పెరుగుదల మధ్యలో వెండి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, ఈరోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా మార్పులు లేకుండా నిలిచాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.79,100ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి రూ. 75,700ల వద్ద స్థిరంగా ఉంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.  దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates Today)  2178.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర నిలకడగా (Gold And Silver Price) ఔన్స్ 24.31డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు