Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,830ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.86,500 వద్ద ఉంది.

Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. 
New Update

గతవారంలో మూడు రోజుల పాటు బంగారం ధరలు(Gold Rate Today) తగ్గాయి. మరో రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల పాటు పెరుగుదల నమోదు చేశాయి. మొత్తంగా చూసుకుంటే, క్రితం వారం కంటే.. ధరలు కాస్త తగ్గుదల నమోదు చేశాయని చెప్పవచ్చు. అయితే, బంగారం ధరల కదలిక చాలా అస్థిరంగా ఉంది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి టెన్షన్ తగ్గడం లేదు. బంగారం కాస్త తగ్గింది.. ఇంకా తగ్గుతుందేమో వేచి చూద్దాం అనుకుంటే, వెంటనే ధరలు పెరిగి అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరల్లో నిలకడ రావడం కష్టమే అనేది నిపుణుల అభిప్రాయం. 

సాధారణంగా బంగారం ధరలు(Gold Rate Today)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ  వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. నిన్న పెరుగుదల కనబరిచి టెన్షన్ పెట్టాయి. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధరల్లో మార్పు రాలేదు.  బంగారం ధరల(Gold Rate Today)  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి.  

ఇక ఈరోజు అంటే మే 6న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  భారీగా పెరిగింది. కానీ,  దేశీయంగా మాత్రం  బంగారం ధరలు(gold rate today) నిలకడగా ఉన్నాయి.  మరోవైపు వెండి ధరలు కూడా  అంతర్జాతీయంగా కాస్త పెరిగాయి.  అయినా, దేశీయంగా మార్పులు లేకుండా నిన్నటి ధరల వద్దే నిలిచాయి. ఈరోజు అంటే సోమవారం (మే 6) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు  నిలకడగా ఉన్నాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate)  రూ.65,850ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు  రూ.71,830లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) కూడా మారలేదు. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.66,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,980ల వద్ద నిలిచింది. 

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Rate Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. నిన్న కాస్త తగ్గిన  వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.86,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి  చేసి రూ.83,000ల వద్ద నిలిచింది. 

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 8గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,314.10డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 26.97డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. 

#gold-rate-in-hyderabad #gold-rate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe