Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

నిన్న కాస్త పెరుగుదల కనబరిచిన బంగారం ధర ఈరోజు మార్పులు లేకుండా నిలిచింది.  ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,930ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.87,500 వద్ద ఉంది.

New Update
Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

ఇటీవల కాలంలో తగ్గుదల బాటలో కనిపించి.. మళ్ళీ పైకెగసిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. తగ్గుదల బాటలో ఉన్న బంగారం ధరలు నిన్న కాస్త పెరుగుదల కనబరచడంతో టెన్షన్ పడిన పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తూ ఈరోజు బంగారం ధరలు నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold Rate Today)పరిస్థితి ఇలా ఉంటే,  మరోవైపు వెండి ధరలు కూడా మార్పులు లేకుండా నిలిచాయి. 

సాధారణంగా బంగారం ధరలు  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, వారం క్రితం బంగారం ధరలు కాస్త తగ్గినట్టు కనిపించి ఊపిరి పీల్చుకున్న గోల్డ్ లవర్స్ కి షాకిస్తూ నిన్న మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. అయితే, ఈరోజు మార్పులు లేకుండా బంగారం ధరలు నిలిచాయి. బంగారం ధరల  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. 

ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 29న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  తగ్గుదల  నమోదు చేసింది.   దీంతో దేశీయంగా మాత్రం బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు అంతర్జాతీయంగా తగ్గాయి.  దీంతో దేశీయంగా కూడా నిన్న కాస్త తగ్గుదల కనబరిచాయి. ఈరోజు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి.  ఈరోజు అంటే సోమవారం (ఏప్రిల్ 29) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.   దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today)  రూ.66,850ల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు  రూ.72,930ల వద్ద స్థిరంగా నిలిచింది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా  రూ.73,080ల వద్ద కొనసాగుతోంది. 

Also Read : తగ్గడం తాత్కాలికమే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంత ఉందంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల (Gold Rate Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న కాస్త తగ్గిన వెండి ధరలు ఈరోజు  స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి రూ.84,000ల వద్ద స్థిరంగా ఉంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 7 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో  2,330.49 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.23డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు