Hijab Ban: హిజాబ్‌పై సీఎం కీలక ప్రకటన.. ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం!

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

Hijab Ban: హిజాబ్‌పై సీఎం కీలక ప్రకటన.. ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం!
New Update

కర్ణాటకలోని స్కూల్స్‌, కాలేజీలకు విద్యార్థులు హిజాబ్‌ ధరించిరావడంపై తీవ్ర రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇది మతాల పరంగాను, రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని రేపింది. అనేక కోర్టులు చుట్టూ ఈ కేసు తిరిగింది. చివరకు నాటి బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై ఆంక్షలు విధించింది. దీనిపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిజాబ్‌ చుట్టూ అనేక రాజకీయ ప్రసంగాలు సాగాయి. కాంగ్రెస్‌కు ఇదే ప్రధాన అస్త్రంగా నిలిచింది. ఇక తాజాగా హిజాబ్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు.

ధరించవచ్చు.. నిషేధం ఎత్తివేత!
హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 'బట్టల ఎంపిక ఒకరి సొంత హక్కు' అని ఆయన చెప్పారు. సమాజాన్ని బట్టలు, వేషధారణ, కుల ప్రాతిపదికన బీజేపీ విభజించిందని ఆయన ఆరోపించారు. గత బీజేపీ ప్రభుత్వం 2022లో కర్నాటక వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కొందరు ముస్లిం మహిళలు తలకు చుట్టుకున్న హిజాబ్, కండువాపై నిషేధం విధిస్తూ జారి చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఇక ఈ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. కోర్టు ఆర్డర్స్‌ను లెక్కచేయలేదని ఆరోపించింది. ముస్లిం అప్పీస్‌మెంట్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించింది.

అప్పుడేం జరిగింది?
కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని భారతీయ జనతా పార్టీ (గత ప్రభుత్వం) నిషేధించింది. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిషేధాన్ని తొలగించింది. 2022లో బీజేపీ-బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధించిన తర్వాత రాష్ట్రంలో నెల రోజుల పాటు వివాదం నెలకొంది. ఈ ఉత్తర్వుపై పిటిషన్లు దాఖలైన తర్వాత, కర్ణాటక హైకోర్టు కూడా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ పాటించాలని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్‌ ధరించడం వల్లే తమను తరగతులకు హాజరుకాకుండా నిలిపివేశారని జిల్లాలోని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. కర్ణాటక హైకోర్టు నిరాశపరిచిన తర్వాత, దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

Also Read: ఈ సెంచరీ సంజూ కెరీర్‌ని మార్చేస్తుంది.. ఇన్నాళ్లు ఎందుకు పక్కన పెట్టారు భయ్యా!

WATCH:

#karnataka #siddaramaiah #hijab
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe