/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-8-11.jpg)
Nivetha Thomas Latest Post About Her New Movie : మలయాళ బ్యూటీ నివేదా థామస్ నిన్న తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.'కొంత కాలం గడిచింది... కానీ..ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో నివేదా థామస్ సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సైతం ఇది నిజమే అని అనుకున్నారు. కట్ చేస్తే.. అది నిజం కాదు. నివేదా థామస్ పెట్టిన పోస్ట్ తన కొత్త సినిమా గురించి అని తాజాగా క్లారిటీ వచ్చేసింది.
రూమర్స్ కు ఫుల్ స్టాప్..
నివేదా థామస్ తాజాగా సోషల్ మీడియాలో.. ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అని కొత్త సినిమాను ప్రకటించారు. దీంతో ఆమె పెట్టిన స్టేటస్ పెళ్లి గురించి కాదని.. కొత్త సినిమా గురించేనని క్లారిటీ వచ్చింది. ‘35 - ఇది చిన్న కథ కాదు’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
Also Read : ‘కల్కి’ ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!
దగ్గుబాటి రానా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడం విశేషం. ఈ సినిమా పోస్టర్‌ను రానా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథ అని.. అందరి హృదయాలను హత్తుకుంటుందని ఆయన తెలిపారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చెప్పారు. ఈ చిత్రంతో నందకిశోర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.
From the sacred land of Tirupathi,
bringing you a lovely narrative that will touch everyone’s heart!35 ~ CHINNA KATHA KAADU ♥️#35Movie
In cinemas from August 15, 2024. @RanaDaggubati #NandaKisore #VivekSagar @nikethbommi @PriyadarshiPN @imvishwadev @gautamitads… pic.twitter.com/4uhG64aSGj— Nivetha Thomas (@i_nivethathomas) June 25, 2024