Economic Survey: పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే రిపోర్ట్! అందులో ఏముందంటే..

పార్లమెంట్ లో కొద్దిసేపటి క్రితం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు ఆర్థిక సర్వే సమర్పించారు. జీడీపీ వృద్ధి 7 శాతానికి చేరుకోవచ్చని సర్వే చెబుతోంది. రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు 

Economic Survey: పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే రిపోర్ట్! అందులో ఏముందంటే..
New Update

Economic Survey: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే జూలై 22 సోమవారం ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి 6.5 నుండి 7% ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం 2:30 గంటలకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను అందజేస్తుంది. దీనిని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రదర్శించారు. గత 12 నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సర్వే సమీక్షించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎలాంటి అంచనాలు ఉండబోతున్నాయనే సమాచారాన్ని కూడా ఈ సర్వే తెలియజేస్తుంది.

ఆర్థిక సర్వేలు సాధారణంగా రెండు వాల్యూమ్‌లతో  ఉంటాయి:

  • ఆర్థిక సర్వే, వాల్యూమ్ I: సంభావిత -విశ్లేషణాత్మక సమస్యలు.
  • ఎకనామిక్ సర్వే, వాల్యూమ్ II: స్టేట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ.

ఆర్థిక సర్వేకు సంబంధించిన 5 ముఖ్య విషయాలు

  • ఆర్థిక సర్వే రాబోయే సంవత్సరానికి బడ్జెట్ ప్రాధాన్యతల గురించి సమాచారంతో ఉంది. 
  • అభివృద్ధి సమీక్షతో పాటు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన రంగాలను కూడా ఇది హైలైట్ చేస్తుంది.
  • సర్వే చుట్టూ జరుగుతున్న అనేక సమస్యలను విశ్లేషిస్తుంది.  వాటి కారణాలను కూడా వివరిస్తుంది.
  • ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) మార్గదర్శకత్వంలో రూపొందించారు.
  • ఆర్ధిక సర్వేను  1950-51 నుండి 1964 వరకు బడ్జెట్‌తో పాటు సమర్పించేవారు. దీనిని  ఇప్పుడు బడ్జెట్‌కు ముందు రోజు ప్రవేశపెడుతున్నారు. 

FY 2024లో GDP వృద్ధి 8.2%..
మే 31న ప్రభుత్వం మొత్తం సంవత్సరానికి అంటే 2024 FYకి సంబంధించిన తాత్కాలిక అంచనాను విడుదల చేసింది. FY24లో GDP వృద్ధి 8.2%. FY23లో GDP వృద్ధి 7%. ఒక నెల క్రితం, RBI FY25 కోసం GDP వృద్ధి అంచనాను 7.2%కి పెంచింది. ఆర్‌బిఐ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.5% వద్ద కొనసాగించింది.

ఈరోజు ఆర్థిక సర్వేలో ఏముందంటే.. 

Economic Survey: దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ 2024-25 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నా.. దేశీయంగా మాత్రం ఆ ఇబ్బంది లేదని సర్వే చెబుతోంది. అయితే, అంతర్జాతీయంగా వచ్చే పరిణామాలు ఆర్బీఐ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

Economic Survey: ప్రయివేట్ పెట్టుబడుల వృద్ధికి టోడ్పడేలా కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి. ఇక మన దేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లదే కీలక పాత్ర అని సర్వే రిపోర్ట్ తేల్చింది. చైనీస్ ఎఫ్‌డిఐని పెంచడం వల్ల గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం వాటాను పెంచడానికి  అలాగే ఎగుమతులను పెంచడానికి సహాయపడుతుంది.

Economic Survey: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్టు సర్వే చెబుతోంది.  2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని వెల్లడైంది. ఇక ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను రూపొందించింది. ఇందులో రూ.14 వేలకోట్లు వరకూ ఆచరణలోకి వచ్చినట్టు సర్వే స్పష్టం చేసింది. 

ఇంకా సర్వేలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

ఐటీ రంగంలో నియామకాలు మందగించాయి

ఎఫ్‌వై 24లో ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్ గణనీయంగా మందగించిందని ఆర్థిక సర్వే చెబుతోంది. నియామకంలో తదుపరి క్షీణత ఉండకపోవచ్చు, కానీ ఎటువంటి పెరుగుదలపై ఆశ లేదు.

ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది

Economic Survey: ఆహార ద్రవ్యోల్బణం గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో, వ్యవసాయ రంగం ప్రతికూల వాతావరణం, క్షీణిస్తున్న నీటి నిల్వలు - పంట నష్టాల కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. ఇది వ్యవసాయోత్పత్తి మరియు ఆహార ధరలను ప్రభావితం చేసింది. దీని కారణంగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉండగా, FY 24లో 7.5%కి పెరిగింది.

అందుకే ఉల్లి, టమాటా ధరలు పెరిగాయి.. 

Economic Survey: టమాటా- పంటలకు వచ్చే వ్యాధులు, అకాల వర్షాలు, రవాణాలో సమస్యల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయింది. ఉల్లి - గత పంట సీజన్‌లో వర్షం కారణంగా రబీ ఉల్లి నాణ్యత దెబ్బతింది, ఖరీఫ్ ఉల్లి నాట్లు ఆలస్యం - ఖరీఫ్ ఉత్పత్తిపై దీర్ఘకాలిక కరువు ప్రభావం పడింది. 

ఎరువుల ధరలు తగ్గే అవకాశం.. 

ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ బలమైన డిమాండ్ -ఎగుమతులపై పరిమితుల కారణంగా, ఇది 2015-2019 స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది.

స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్‌లో భారీ జంప్

భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్‌లో భారీ జంప్ జరిగింది. స్టాక్ మార్కెట్ యొక్క GDP - మార్కెట్ క్యాప్ నిష్పత్తి ప్రపంచంలో ఐదవ అతిపెద్దది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe